ఆంధ్రప్రదేశ్‌

జగన్ అక్రమాస్తుల కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: జగన్ అక్రమాస్తుల కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌పై వచ్చిన అభియోగాలను విచారిస్తున్న సిబిఐ ప్రత్యేక కోర్టులో క్రిమినల్స్ ప్రొసీడింగ్స్‌పై స్టే విధిస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా, రంగారెడ్డి జిల్లాలో ఇండియా సిమెంట్స్‌కు చెందిన ఫ్యాక్టరీకి నీటిని కేటాయించారనే అభియోగాలను మోపుతూ సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఆదిత్యనాథ్ దాస్ తరఫున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇంటర్‌స్టేట్ వాటర్ రెగ్యులేటరీ కౌన్సిల్ అనుమతి మేరకు నీటిని కేటాయించారని పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సిబిఐ తరఫున న్యాయవాది కేశవరావు వ్యతిరేకించారు. కాగా సిబిఐ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు జడ్జి జస్టిస్ రాజా ఎలాంగో ఆదేశాలు జారీ చేశారు. కాగా, జగన్ అక్రమాస్తుల కేసులో అరబిందో ఎండి నిత్యానందరెడ్డి, ఇందూ గ్రూప్ కంపెనీల ఆడిటర్ సివి కోటేశ్వరరావులకు సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.