ఆంధ్రప్రదేశ్‌

పెరుగుతున్న సైబర్ నేరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 22: రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సరైన నియంత్రణ లేకపోవడంతో పాటు కొన్ని సంస్థల నిర్లక్ష్య వైఖరి కూడా సైబర్ నేరాల వృద్ధికి కారణమవుతోంది. గత ఐదేళ్లలో కోట్లాది రూపాయల సొత్తు నేరగాళ్ల పాలైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సైబర్ నేరాల నమోదులో విశాఖపట్నం దేశంలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బెంగళూరు ఉండగా, స్వల్ప పాయింట్ల తేడాతో విశాఖ రెండో స్థానానికి చేరుకుంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో 927 సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు నమోదు కాగా 572 కేసులు మాత్రమే విచారణకు వచ్చాయి. ఇది 60 శాతం మాత్రమే. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 282 మందిని గుర్తించి అరెస్టు చేయగా, కేవలం 75 మందికి మాత్రమే శిక్ష పడింది. సైబర్ నేరాలకు సంబంధించి గత ఏడాది 308 కేసులు నమోదయ్యాయి. అందులో విశాఖ కేంద్రంగా జరిగిన నేరాలు 267. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి పూర్తి వివరాలు సేకరించడం పోలీసువర్గాలకు తలకు మించిన భారమవుతోంది. ముఖ్యంగా కొన్ని బ్యాంకులు సరైన ధృవీకరణ పత్రాలు లేకుండానే ఖాతా తెరవడంతో నేరగాళ్ల ఆచూకీ లభ్యం కావడం లేదు. ముఖ్యంగా కొన్ని కార్పొరేట్ బ్యాంకులు ఖాతాలు తెలిచేవారి వివరాలు, చిరునామా ధృవీకరణ నిర్ధారించడం లేదని పోలీసు అధికారులు వాపోతున్నారు. బీహార్, జార్ఖండ్, న్యూఢిల్లీ, నోయిడా, ముంబై తదితర నగరాల్లో ఖాతా ప్రారంభిస్తున్న సైబర్ నేరగాళ్లు రాష్ట్రంలో అమాయకులకు ఎరవేసి దోచుకుంటున్నారు. లాటరీలు, ఉద్యోగాల ఆశపెట్టి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమచేయించి ఉడాయిస్తున్నారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసినప్పటికీ ఫలితం ఉండడం లేదు. ఇటీవల విశాఖ కేంద్రంగా జరిగిన ఆన్‌లైన్ మోసంలో ఓ బాధితుడు రూ.1.31 కోట్లు పోగొట్టుకున్నాడు. లాటరీలో రూ.55 కోట్లు వచ్చాయని నమ్మించిన ఆన్‌లైన్ మోసగాళ్లు బాధితుని నుంచి పలు దఫదాలుగా ఈ మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాల్లో జమచేయించుకున్నారు. ఈ కేసులో 35 మందిని నేరస్తులుగా గుర్తించిన పోలీసులు కేవలం ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకోగలిగారు. మిగిలినవారంతా తప్పుడు ధృవీకరణతో బ్యాంకుల్లో ఖతాలు తెలిచినవారే కావడం గమనార్హం. ఇక ఫేస్‌బుక్, వాట్సాఫ్, గూగూల్ వంటి మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్ మోసాలు హెచ్చుమీరుతున్నాయి.