ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా భ్రమరాంబదేవి కుంభోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఏప్రిల్ 14: శ్రీశైలం మహాక్షేత్రంలోలో కొలువైన శ్రీభ్రమరాంబదేవి అమ్మవారి వార్షిక కుంభోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం, శుక్రవారం అమ్మవారికి సాత్విక బలి సమర్పించి కుంభోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నం రాశిని సాత్విక బలిగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా శ్రీభ్రమరాంబదేవి వార్షిక కుంభోత్సవాన్ని ఆలయ అధికారులు, వ్యాపార సంఘాల వారు భక్త్భివంతో నిర్వహించారు. ఈ సందర్భంగా 121 కిలోల కుంకుమ, 121 కిలోల పసుపు, 1,516 గుమ్మడికాయలు, 3 వేల కొబ్బరికాయలు, 80 వేల నిమ్మకాయలతోపాటు 200 కిలోల అన్నం (కుంభం) అమ్మవారికి సాత్విక బలిగా దేవస్థానం తరపున సమర్పించారు. శ్రీశైలం క్షేత్రం బాగుండాలని, మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రజలు, వ్యాపార సంఘాల వారు కలిసి 108 గుమ్మడికాయలు, 6,700 కొబ్బరికాయలు, 70 క్వింటాళ్ల అన్నం అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని వేలాది నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ఉత్సవానికి పలువురు భక్తులు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు. శుక్రవారం ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం అమ్మవారికి ఆలయ అర్చక వేద పండితులు నవావర్ణ పూజలు, శ్రీశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలు, జప పారాయణాలు నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఏకాంతంగా పండితులు, అర్చకులు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో శ్రీచక్రం వద్ద చాకలి వారిచే ముగ్గు వేయించి విశేష పూజలను వేద పండితులు నిర్వహించారు. సాత్విక బలి కోసం సిద్ధం చేసిన కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలివిడత సాత్విక బలిగా గుమ్మడికాయలు, నిమ్మకాయలు సమర్పించారు. అనంతరం హరిహరరాయ గోపురం వద్ద మహిషాసురమర్ధిని అమ్మవారికి(కోటమ్మ) ప్రత్యేక పూజలు చేసి సాత్విక బలిగా, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు. సాయంత్రం శ్రీమల్లికార్జున స్వామివార్లకుఅన్నాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు.