ఆంధ్రప్రదేశ్‌

పోలవరం కోసం ‘చలో ఢిల్లీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 16: పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నదాతలు ‘చలో ఢిల్లీ’కి పయనం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి బహుళార్ధ సాధక ప్రాజెక్టు పోలవరం గురించి ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోని అన్నదాతలు, ఎంపీలను సమీకరించే పనిలో రైతు కార్యాచరణ సమితి ఉంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టుకు 2014 నాటికి ఉన్న అంచనా నిధులను మాత్రమే ఇస్తున్నట్టు ప్రకటించడాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతు సంఘాలు, అన్నదాతలు తప్పుపడుతున్నాయి. దీంతో కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పోలవరం సాధన సమితి కన్వీనర్, మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి, రైతు కార్యాచరణ సమితి అధికార ప్రతినిధి ఎంవి సూర్యనారాయణరాజు, గోదావరి డెల్టాల పరిరక్షణ కమిటీ ఇలా అనేక సంఘాలు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి.