ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదాల నివారణకు ఓ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 22: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, స్నేహపూర్వక పోలీసు వ్యవస్థకు కృషి చేస్తున్నట్లు హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. శనివారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో పోలీసుల వసతి గృహాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయన్నారు.
టెక్నాలజీ పెరగడంతో నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. అదే టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో స్నేహపూర్వక పోలిసింగ్ వ్యవస్థకు నాంది పలికామన్నారు. పోలీసులు ప్రజలతో స్నేహసంబంధాలు కలిగి ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మూడుశాఖలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పోలీసు, రవాణ, రహదారులు, భవనాల శాఖలతో కమిటీ వేశామని, ఈ కమిటీ ఆధ్వర్యంలో రహదారులపై ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా రవాణాశాఖ అప్రమత్తంగా ఉండాలని, భారీ వాహనాలు నడిపే వారికి లైసెన్సు తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల యజమానులు కూడా లైసెన్సుతోపాటు అనుభవం ఉన్న డ్రైవర్లకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అటు డ్రైవర్లకు, ఇటు ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, భూమా అఖిలప్రియ తదితరులు పాల్గొన్నారు.
పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్న జగన్
బనగానపల్లె: వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి పనిగట్టుకుని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప అన్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వీటిని ప్రజలు నమ్మవద్దన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి రైతులు 34 వేల ఎకరాల భూమి స్వచ్చందంగా అప్పగించారన్నారు. అందులోనే అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలు జరిగాయన్నారు. దీన్ని కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని, అనవసరంగా ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రభుత్వ నిర్వహణ, రాష్ట్ర అభివృద్ది విషయంలో జగన్ సలహాలు, సూచనలు ఇవ్వకుండా విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకు 20 గంటల పాటు కష్టపడి పనిచేస్తున్నారని, విజయవాడ కేంద్రంగా రోజువారీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. జగన్ అసెంబ్లీ సమావేశాల సమయంలో నాలుగు రోజులు మినహా విజయవాడలో ఉండలేదన్నారు. మే నెల 27 నుండి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహిస్తామన్నారు. ఎక్కడ నిర్వహించేది ముఖ్యమంత్రి త్వరలో ప్రకటిస్తారన్నారు.

చిత్రం..నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న హోంమంత్రి చిన రాజప్ప