ఆంధ్రప్రదేశ్‌

ట్రిబ్యునల్ తీర్పు మేరకే నేరడి బ్యారేజ్ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడిశా వాదనలు పూర్తి శ మేలో ఆంధ్రావాదనలు శ నేడు నిపుణుల పర్యటన

హిరమండలం, ఏప్రిల్ 24: శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు, వంశధార నీటిని వినియోగించడానికి చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం నియమించిన అంతర్రాష్ట్ర జల వివాదాల ట్రిబ్యునల్ ఈ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు చేపట్టింది. సోమవారం ట్రిబ్యునల్ కమిటీ హిరమండలం వద్ద నిర్మిస్తున్న జలాశయాన్ని, గొట్టా బ్యారేజ్ సాగునీటి ప్రాజెక్టును పరిశీలించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జల వివాదాల సలహాదారు డి.రామకృష్ణ విలేఖరులతో మాట్లాడారు. వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ ఆదేశాల మేరకు కమిటీకి సంబంధించి న్యూఢిల్లీకి చెందిన అగర్వాల్, భరద్వాజతో కూడిన కమిటీ పర్యటించిందని తెలిపారు. ట్రిబ్యునల్‌లో ఆంధ్రా, ఒడిశా అధికారుల వాదనలు వినిపించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం తమ వాదనలు పూర్తిచేసిందని తెలిపారు. ఆంధ్రా ప్రభుత్వం మేలో తన వాదనలను ప్రారంభించి వేసవి సెలవుల అనంతరం జూలై, ఆగస్టు నెలల్లో వాదనలను ట్రిబ్యునల్ ముందు వినిపించనున్నట్టు తెలిపారు. ఇందుకు గాను వివాదాల పరిష్కార వేదిక నివేదిక అక్టోబర్ నెలలో వెల్లడిస్తుందన్నారు. ట్రిబ్యునల్ ఆదేశం మేరకు ఇప్పటికే వంశధార జలాశయానికి సంబంధించి భామిని మండలం కాట్రగడ వద్ద సైడ్ వ్యూయర్స్ పనులు నిర్వహిస్తున్నారన్నారు. ఒడిశా అధికారులు కూడా కమిటీకి తమ సమస్యలను వివరించినట్టు తెలిపారు. ట్రిబ్యునల్ అంతిమ తీర్పు ఆధారంగా వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు వంశధార రిజర్వాయర్‌ను పరిశీలించి నీటి నిల్వ వివరాలను, పనుల ప్రగతిని పరిశీలించారు. అలాగే గొట్టాబ్యారేజీ సాగునీటి ప్రాజెక్టును పరిశీలించి జిల్లాలోని పంట భూములకు అందుతున్న సాగునీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వంశధార నది నీటికి సంబంధించి ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాం పరిష్కారానికి ట్రిబ్యునల్ కమిటీ మంగళవారం ఒడిశాలో పర్యటించనున్నట్టు జల వివాద సలహాదారు రామకృష్ణ తెలిపారు. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన కమిటీలతో పాటు ఆంధ్రా అధికారులు కాశీనగర్ ప్రాంతంలోని వంశధార నదిని పరిశీలిస్తారన్నారు. గతంలో ట్రిబ్యునల్ కమిటీ ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో పరిశీలించగా, రెండోసారి కమిటీ పరిశీలించి నివేదిక అందజేస్తుందన్నారు. సాంకేతిక సలహాదారులు వివిఎస్ రమణమూర్తి, రౌతు సత్యనారాయణ, సిఇ ఎంపి రాజు, వంశధార ఎస్‌ఇ అప్పలనాయుడు పాల్గొన్నారు.