ఆంధ్రప్రదేశ్‌

విద్యాసంస్థల్లో ఆగని వేసవి తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 27: వేసవిలో ఎటువంటి తరగతులు నిర్వహించినా, ఆ విద్యా సంస్థలపై చర్యలు తప్పవని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించి 24 గంటలు గడవక ముందే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు తరగతులను గురువారం ప్రారంభించాయి. వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ తదితర పేర్లతో తరగతులు నిర్వహించడంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు మంత్రి గంటా కూడా వేసవిలో తరగతులు నిర్వహించే విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలను తాటాకు చప్పుళ్లుగా భావించిన కొన్ని విద్యా సంస్థలు 10వ తరగతి ఫలితాలు రాకముందే తరగతులను ప్రారంభించాయి. మంత్రులకు సంబంధించిన వ్యవహారం కూడా కావడంతో అధికారులు ఆచితూచి వ్యవహరించనున్నారు.