ఆంధ్రప్రదేశ్‌

ప్రోత్సాహకాలు ప్రకటించినా స్పందన స్వల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 39: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నగదు బహుమతులను ప్రకటించిన ఆశించిన మేరకు నగదు రహిత లావాదేవీలు పుంజుకోవడం లేదు. చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్‌ను నగదు రహితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నప్పటికీ, కార్డుదారుల నుంచి స్పందన అంతగా లభించడం లేదు. పెద్ద నోట్ల రద్దు తరువాత రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇతర రంగాల్లో ఎలా ఉన్నప్పటికీ, రేషన్ దుకాణాల్లో నగదు రహితంగానే సరకులను సరఫరా చేయలని నిర్ణయించారు. గడచిన మూడు నెలల్లో ఆశించిన స్థాయిలో రేషన్ సరఫరాకు సంబంధించి నగదు రహితం ఆశించిన స్థాయిలో పెరుగలేదు. మార్చి నెలలో నగదు రహిత లావాదేవీలు 25 శాతానికే పరిమితమైంది. కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా నగదు రహిత లావాదేవీలు నమోదు అయ్యాయి. సర్వస్ సమస్య, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో, రేషన్ దుకాణాల ఖాతాలు బ్యాంక్‌తో అనుసంధానం కాకపోవడం వంటి సమస్యలతో ఆశించిన మేర నగదు రహిత లావాదేవీలు జరగలేదు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు జిల్లాకు నెలకు లక్ష రూపాయల బహుమతి, రాష్ట్రం అంతటికీ కలిపి 5000 మొబైల్ సెల్‌ఫోన్లు అందచేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఒకసారి లాటరీ విజేతలను ప్రకటించారు. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఏప్రిల్ నెలలో 30.18 శాతం మేర నగదు రహిత లావాదేవీలు జరిగాయి. గత నెలతో పోలిస్తే 5 శాతం మేర పెరిగినప్పటికీ, ప్రభుత్వం ఆశించినంత వేగంగా పెరగకపోవడం గమనార్హం. 74 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 58.5 శాతంతో తూర్పుగోదావరి, 58.13 శాతంతో పశ్చిమ గోదావరి తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కడపలో 14.6 శాతం, విజయనగరంలో 12 శాతం, ప్రకాశంలో 10.3 శాతం మేర జరిగాయి. అనంతపురంలో 7.48 శాతం, విశాఖపట్నంలో 6, నెల్లూరులో 5.18 శాతం మాత్రమే జరిగి సింగిల్ డిజిట్‌ను ఇంకా దాటలేదు. సాంకేతిక ఇబ్బందుల కారణంగా నగదుతో కూడా సరకులను తీసుకువెళ్లే వీలు ఉండటంతో దాని ప్రభావం కూడా నగదు రహితంపై పడిందనవచ్చు.