ఆంధ్రప్రదేశ్‌

రైతు చుట్టూ రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 30: రాష్ట్ర రాజకీయం ప్రస్తుతం రైతుల చుట్టూ పరిభ్రమిస్తోంది. గిట్టుబాటు ధర కోసం రెండు నెలలుగా ఉద్యమించి మద్దతు ధర సాధించుకున్న మిర్చి రైతులకు ఇంకా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు సాగు ధృవీకరణ పత్రాల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి, వ్యాపారులు విదిలించిన ధరకు సరకు అమ్ముకుని మద్దతు ధర కోసం నిరీక్షిస్తుంటే ప్రతిపక్ష నేత దీక్షకు దిగటం, అధికార పార్టీ యార్డుకు సెలవులు ప్రకటించటంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. మిర్చితో పాటు పసుపు కొనుగోళ్లు మార్క్‌ఫెడ్ ద్వారా ఇటీవలే ప్రారంభమయ్యాయి. యార్డులకు ఇబ్బడిముబ్బడిగా సరకు వచ్చి చేరుతోంది. మిర్చి రైతులకు ‘చంద్రన్న రాయితీ’గా ప్రభుత్వం రూ.15 వందల మద్దతు ధర ప్రకటించింది. 20 క్వింటాళ్ల లోపు రూ.6500 ధర మేరకే ఈ పథకం వర్తించేలా నిబంధనలు విధించారు. పసుపు క్వింటాకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.6వేల నుండి 6500 వరకు ధర చెల్లిస్తున్నారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు చేతులెత్తేసిన నేపథ్యంలో గుంటూరు మిర్చియార్డుకు తాకిడి ఎక్కువైంది. లక్షలాది టిక్కీల మిర్చి దిగుమతి అవుతోంది. ఈనేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే డిమాండ్‌తో గుంటూరు మిర్చియార్డు సమీపంలో సోమ, మంగళవారాల్లో దీక్షకు సిద్ధమయ్యారు. యార్డులో నిల్వలు పేరుకుపోతున్న పరిస్థితుల్లో భద్రతా కారణాల రీత్యా మార్కెటింగ్ అధికారులు గత శుక్రవారం నుంచి సెలవు ప్రకటించి ఆగమేఘాల మీద సోమవారం మేడేతో పాటు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. యార్డుకు సెలవులు ప్రకటించినా రద్దీ దృష్ట్యా కొనుగోళ్లు జరుపుకోవాలని మార్కెటింగ్ అధికారులు వ్యాపారులకు సూచించారు. కొనుగోలు చేసిన మిర్చిని ఎగుమతి వ్యాపారులు వెంటనే యార్డు నుంచి తరలించాలని కూడా సూచించారు. అయితే శనివారం అర్ధరాత్రి నుంచి మరో 50వేల టిక్కీలకు పైగా యార్డుకు లారీల్లో సరకు రవాణా అయింది. యార్డులో నిల్వచేసే వీలులేక అధికారులు నిరాకరించారు. బుధవారం మాత్రమే యార్డులోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఉద్దేశ్యపూర్వకంగానే యార్డుకు అదనంగా తరలిస్తున్నారని, దీనివెనుక ప్రతిపక్ష నేతల హస్తం ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు ఆరోపిస్తున్నారు. యార్డుకు అదనపు సరకు రవాణా కాకుండా తాళాలు వేయాలని నిర్ణయించింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నిర్వాకంతో తాము పూర్తిగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదని మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జగన్ రైతుదీక్ష నేపథ్యంలో మంత్రులు ఎదురుదాడికి దిగారు. రైతు రుణమాఫీని వైసిపి మేనిఫెస్టోలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించడం ద్వారా జగన్‌పై ముందస్తు దాడిని ప్రారంభించారు.