ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణకు పంపించేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తమను తెలంగాణకు బదిలీ చేయాలని ఎపి అసెంబ్లీ సెక్రటరీని సోమవారం కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని శాఖల ఉద్యోగుల పంపకాల ప్రక్రియ కొలిక్కి రాకపోవడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య పలుమార్లు ఉద్యోగుల పంపిణీ తదితర అంశాలపై చర్చలు జరిగినప్పటికీ పరిస్థితిలో మార్పులేదు, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల క్రితం ఒక ప్రకటన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణలో పని చేస్తున్న ఎపి ఉద్యోగులు తమ ప్రాంతాలకు బదిలీలు కోరుతూ దరఖాస్తు చేస్తే, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. స్పౌజ్, తదితర కేసులను కూడా పరిశీలిస్తామని తెలపారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన, ఎపి అసెంబ్లీలో పని చేస్తున్న ఉద్యోగులు అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణను కలిసి తమను తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు.