రాష్ట్రీయం

గుంటూరు కమిషనర్‌కు నెల రోజుల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై, కోర్టు ఆదేశాలను అమలుచేయకపోవడం, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంపై గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సెల్వరాజన్ నాగలక్ష్మిపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకుగానూ ఆమెకు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రెండు వేల జరిమానాను విధించింది. అయితే ఆమె అప్పీలు చేసుకునేందుకు వీలుగా నాలుగు వారాల పాటు తీర్పు అమలును నిలిపివేస్తూ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఆదేశాలు ఇచ్చారు. అక్రమ నిర్మాణాన్ని ఆపాలన్న తమ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణాలను కొనసాగించిన డాక్టర్ వరప్రసాద్ సైతం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు గానూ ఆయనకూ రెండు నెలల సాధారణ జైలు శిక్ష, రెండు వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటదని హైకోర్టు వారికి తేల్చి చెప్పింది. డాక్టర్ వరప్రసాద్‌కు అదనపు అంతస్తుల నిర్మాణం నిమిత్తం జిఎంసి ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. అంతేగాక, ఆ భవన నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. కొత్తపేటలో డాక్టర్ ప్రసాద్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను నాలుగు వారాల్లో కూల్చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది.