ఆంధ్రప్రదేశ్‌

కార్మిక పక్షపాతి టిడిపి ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 1: కార్మిక పక్షపాతి తెలుగుదేశం ప్రభుత్వమని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి పితాని సత్యనారాయణ ఉద్ఘాటించారు. టిడిపి అనుబంధ టిఎన్‌టియుసికి నేడు పటిష్ట నాయకత్వం ఉందన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమ కార్యక్రమాలతోపాటు చంద్రన్న భీమా పథకం కింద నేడు రాష్ట్రంలో సమర్థవంతంగా అమలవుతోందని చెప్పారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా టిఎన్‌టియుసి ఆధ్వర్యాన విజయవాడలో సోమవారం సాయంత్రం భారీ బహిరంగ సభ జరిగింది. అంతకుముందు నగరంలోని 60 ప్రాంతాల్లో టిఎన్‌టియుసి పతాకావిష్కరణ జరిగింది. అనంతరం వేల సంఖ్యలో ట్రేడ్ యూనియన్ కార్మికులతో నగర వీధుల గుండా భారీ ప్రదర్శన కొనసాగింది. జింఖానాగ్రౌండ్సులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టిఎన్‌టియుసి అర్బన్ అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు అధ్యక్షత వహించి ప్రధానోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పితాని కార్మికులనుద్ధేశించి మాట్లాడుతూ గతంలో కార్మిక సంఘాలే కమ్యూనిస్టులు అనే స్థితి నుంచి నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇక కార్మికుల పక్షాన పోరాడేది టిఎన్‌టియుసి ఒక్కటేనన్నారు. తెలుగుదేశం పార్టీ తొలి మేడే వేడుకలు 2015లో నిర్వహించిందని, తద్వారా కార్మికులకు ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అక్టోబర్ 2 నుంచి అసంఘటిత కార్మికులకు, వికలాంగులకు, ఐదులక్షలు, మూడు లక్షలు చొప్పున బీమా వర్తింప చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమల యాజమాన్యం, శ్రామికులు ఇచ్చుపుచ్చుకునే ధోరణితో కలిసి పని చేయడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాధించవచ్చని మంత్రి చెప్పారు.
సభలో పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్‌మీరా, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, టిడిపి అనుబంధ సంఘాల ప్రతినిధి కె పట్ట్భా, పలువురు టిఎన్‌టియుసి నేతలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. టిఎన్‌టియుసి తరుపున ప్రముఖులను సత్కరించి మెమొంటోలు అందచేశారు.

చిత్రం..మేడే సభలో ప్రసంగిస్తున్న మంత్రి పితాని సత్యనారాయణ