ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో 10 స్పోర్ట్స్ అకాడెమీల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 1: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు 10 స్పోర్ట్స్ అకాడెమీలను ఏర్పాటు చేస్తున్నట్టు క్రీడలు, యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఊర్జా 2017, సిపిఎఫ్ ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ టోర్నమెంట్ అండర్ 19 పోటీలను విశాఖలో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే స్పోర్ట్స్ అకాడెమీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ప్రతిపాదించామన్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు రూ.5 లక్షలతో 3వేల పాఠశాలల్లో ఆట స్థలాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఈ వేసవిలో 650 సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. నెల రోజుల పాటు నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో 35 రకాల క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇక యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందన్నారు. నిరుద్యోగ యువతకు భృతి ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించామన్నారు. ఇప్పటికే 40 ఇంజనీరింగ్ కళాశాలల్లో సిమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. రాబోయే రెండేళ్లలో 2లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కె హరిబాబు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర