ఆంధ్రప్రదేశ్‌

ట్రాఫిక్ పరిశోధన సంస్థకు భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, ఏప్రిల్ 25: ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలం పల్లె గ్రామంలో డ్రైవింగ్ శిక్షణ, ట్రాపిక్ పరిశోధన సంస్ధకు మంత్రులు రావెల, శిద్దా సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర రవాణాశాఖామంత్రి శిద్దా మాట్లాడుతూ ఈ డ్రైవింగ్ శిక్షణ, ట్రాఫిక్ పరిశోధన సంస్థను 18.51కోట్లరూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో కేంద్రం 16.34కోట్లు, మారుతీ సుజుకి కోటి 69లక్షల రూపాయలను మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతితర్వాత దొనకొండ ప్రాంతం అంతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగసభలో మంత్రి రావెల మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి అప్పుల ఊబిలో ఉన్నప్పటికి స్వర్ణాంధ్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి నిరంతరం తపిస్తున్నారన్నారన్నారు. ఇదిలావుండగా డ్రైవింగ్ శిక్షణ, ట్రాఫిక్‌పరిశోధన సంస్థ భూమిపూజకు సంబంధించి బహిరంగ సభ జరుగుతుండగా రభస సృష్టిస్తున్న బిజెపి కార్యకర్తలను సభనుంచి పోలీసులు బయటకు పంపించేశారు.