ఆంధ్రప్రదేశ్‌

పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్ష ఫలితాలు ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: ఎపి పోలీస్ రిక్రూట్‌మెంట్ -2016 ఫలితాలను ప్రకటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్పకు, మంత్రి యనమల రామకృష్ణుడుకు ఆ పరీక్ష అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆ పరీక్షకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కొందరు మంత్రులను కలిసి తమ సమస్య తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ప్రిలిమ్స్ పరీక్షను, ఈ ఏడాది జనవరిలో మెయిన్స్ పరీక్షను నిర్వహించారని తెలిపారు. ఫిబ్రవరి 27న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పి, నేటి వరకూ ఫలితాలు వెల్లడించలేదని తెలిపారు. దీని వల్ల దాదాపు 63 వేల మంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారి మానసిక వేదనను అర్థం చేసుకుని ఫలితాలు ప్రకటించాలని కోరారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ, మరికొన్ని పోస్టులను నియామక జాబితాలో చేర్చడం వల్ల ఆలస్యం అవుతోందని, త్వరలో తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.