ఆంధ్రప్రదేశ్‌

రేపు ‘సాస్’ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 3: పొరుగు దేశాలకు సైతం పరస్పర సమాచార వ్యవస్థను మెరుగుపరిచేందుకు సౌత్ ఆసియా శాటిలైట్ (ఎస్‌ఎఎస్) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశానికి అనుగుణంగా ఇస్రో ప్రత్యేక ఉపగ్రహాన్ని రూపొందించి, ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం శుక్రవారం సాయంత్రం 4గంటల 57 నిమిషాలకు జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 09 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.
ప్రయోగ సన్నాహాల్లో భాగంగా బుధవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్.సురేష్ అధ్యక్షతన జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో (ఎంఆర్‌ఆర్) శాస్తవ్రేత్తలు పాల్గొని ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో లాచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ 27గంటలు ముందు అనగా గురువారం మధ్యాహ్నం 1.57గంటలకు ప్రారంభం కానుంది. కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే జిఎస్‌ఎల్‌వి-ఎఫ్09 రాకెట్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా సమాచార రంగానికి చెందిన 2230కిలోల బరువుగల జీశాట్-9 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహంలో 12కెయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లను పంపుతున్నారు. సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి పొరుగు దేశాలకు సైతం ఉపగ్రహం సేవలు అందించే విధంగా ఇస్రో రూపొందించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.450కోట్లు కాగా ఇందులో ఉపగ్రహం ఖర్చు రూ.235కోట్లు, వాహక నౌక ఇతర ఖర్చులు రూ.215కోట్లు. ఇది విజయవంతమైతే 12సంవత్సరాల పాటు మన దేశంతో పాటు దక్షిణ ఆసియా దేశాలకు సేవలు అందించనుంది. ఉపగ్రహ టివి, వీశాట్, దూరవిద్య, దూరవైద్యం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లోను ఇది సేవలు అందిస్తుంది. ఈ ప్రాజెక్టుకు నేపాల్, భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు మద్దతు తెలిపాయి, ఆప్గానిస్తాన్ తుది కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిఎస్‌ఎల్‌వి, విఎస్‌ఎస్‌సి ప్రాజెక్టు డైరెక్టర్లు ఉపమహేశ్వరన్, శివన్ షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఇస్రో చైర్మన్ ఎఎస్. కిరణ్‌కుమార్ షార్‌కు చేరుకొని శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగంపై చర్చించనున్నారు.