రాష్ట్రీయం

‘సాస్’కు షార్ సిద్ధం నేడే ఉపగ్రహ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 4: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక కీలక ప్రయోగం చేపట్టింది. సార్క్ దేశాలన్నీ ఉపయోగించేకొనేందుకు వీలుగా జీశాట్-9 (సాస్) ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. 2,230కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 09 వాహక నౌక ద్వారా శుక్రవారం రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ గురువారం మధ్యాహ్నం 12గంటల 57నిమిషాలకు ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో భాగంగా రాకెట్ చివరి దశలో ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని కూడా శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్ కుమార్ జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 09 రాకెట్‌ను పరిశీలించి కౌంటౌడౌన్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగం పై సుదీర్ఘంగా చర్చించారు. కౌంట్‌డౌన్ 28గంటలు సజావుగా కొనసాగినంతరం శుక్రవారం సాయంత్రం 4:57గంటలకు రాకెట్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నింగిలోకి ఎగరనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరిక మేరకు దక్షిణ ఆసియా దేశాలకు పరస్పర సమాచార వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇస్రో ఈ సాస్ ఉపగ్రహాన్ని రూపొందించింది. మొదట ఈ ఉపగ్రహం పేరు సార్క్‌గా నామకరణం చేశారు. సార్క్ దేశాల నుండి పాకిస్తాన్ తప్పుకోవడంతో ఇస్రో ప్రస్తుతం సాస్ ఉపగ్రహంగా నామకరణం చేసింది. జీశాట్ ప్రయోగంతో భారత్‌తో పాటు నేపాల్,్భటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ దేశాల్లో సమాచార వ్యవస్థ కొత్త పుంతలు తొక్కనుంది. ఈ ఉపగ్రహంలో 12కెయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు ఉంటాయి. టెలీకమ్యూనికేషన్, డిటిహెచ్, వీశాట్స్, టెలీఎడ్యుకేషన్, టెలీమెడిసిన్, విపత్తుల సమయాల్లో నిర్వహణ వంటి సేవలను ఈ శాటిలైట్ ద్వారా పొందవచ్చును. అలాగే దక్షిణాసియాలో భూకంపాలు, తుఫాన్లు, వరదలు, సునామీలు వంటి ప్రమాదాలను ముందుగా తెలుసుకొనే వీలుంటుంది. షార్ కేంద్రం నుండి సాస్ ఉపగ్రహ ప్రయోగం ఉండడంతో సార్క్ దేశాలన్ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రయోగ వీక్షణకు పార్లమెంట్ కమిటి, సార్క్ దేశాల ప్రతినిధులు రానున్నారు. ఈ ప్రయోగానికి మీడియాకు అనుమతి లేదని ఇస్రో వర్గాల నుండి సమాచారం.

చిత్రం,,, ప్రయోగ వేదిక పై సిద్ధంగా జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 09 రాకెట్