ఆంధ్రప్రదేశ్‌

నవ్యాంధ్రలో పెట్టుబడులకు అవకాశాలు అపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లెక్స్‌ట్రానిక్స్ సిఇఓతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం
అమెరికాలో సిఎం పర్యటన ప్రారంభం

విజయవాడ, మే 5: ఆంధ్రప్రదేశ్‌లో విస్తరణకు గల విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ సంస్థ ‘ఫ్లెక్స్‌ట్రానిక్స్’కు సూచించారు. ముఖ్యమంత్రి బృందం అమెరికా పర్యటన బహుళజాతి సాంకేతిక తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఫ్లెక్స్‌ట్రానిక్స్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి మైక్ మెక్‌నమరతో తొలి సమావేశం జరిగింది. అంతకుముందు నిర్ణీత సమయానికి రెండున్నర గంటలు ఆలస్యంగా శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగిడిన ముఖ్యమంత్రి, మరో 14 మందితో కూడిన బృందానికి అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలు ఘన స్వాగతం పలికాయి.
ఫ్లెక్స్‌ట్రానిక్స్ సిఈఓతో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులు, సానుకూల అంశాల గురించి వివరించారు. ఆగ్నేయాసియా దేశాల రాకపోకలకు వీలుగా తమ రాష్ట్రం కోస్తా తీరం కేంద్రంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, జల, ఇంధన, మానవ వనరులకు ఏపీలో కొదవ లేదని వివరించారు. తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించిన మైక్ విశాఖపట్నంలో ఇప్పటికే తమ ఉనికి ఉన్నదని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై మైక్ సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి నేరుగా కాలిఫోర్నియా బయల్దేరి వెళ్లారు. అక్కడ గవర్నర్ ఎడ్మంట్ గెరాల్డ్ జెర్రీ బ్రౌన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన క్రియాశీలక పాత్ర, కాంగ్రెసేతర ఉద్యమాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్‌కు వివరించారు. గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి ఉపక్రమించామని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో తమ రాష్ట్రానికి కాలిఫోర్నియా సహకారాన్ని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రకృతిని పరిరక్షించే ఉద్యమాన్ని పౌర భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా మలిచామని తెలిపారు. ఈ ప్రక్రియలో తమకు తోడ్పాటును అందించాలని కోరారు. కొత్త రాజధాని అమరావతిని నిర్మాణ దశలోనే సందర్శించి తగు సూచనలు, సహకారం అందించడానికి ఆంధ్రప్రదేశ్ రావాలని గవర్నర్ బ్రౌన్‌ను ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి వెంట ఈ పర్యటనలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వాహక అధికారి జాస్తి కృష్ణకిషోర్, సిఆర్‌డిఎ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఐటి ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ తదితరులున్నారు.

చిత్రం... శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో చంద్రబాబు బృందానికి స్వాగతం చెబుతున్న ప్రవాసాంధ్రులు