ఆంధ్రప్రదేశ్‌

మా స్టైపెండ్ మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెడికల్ పిజి విద్యార్థుల ప్రశ్న ప్రభుత్వ వైఖరిపై సందేహాలు ఆందోళన వద్దన్న మంత్రి కామినేని

విజయవాడ, మే 6: మెడికల్ పీజీ డిప్లొమో కోర్సులకు ఫీజులను సవరించిన ప్రభుత్వం, స్టైపెండ్ చెల్లింపులపై స్పష్టత ఇవ్వకపోవడంతో వైద్య విద్యార్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కన్వీనర్ కోటాకు స్టైపెండ్‌పై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మెడికల్ పీజీ డిప్లొమో కోర్సులకు ఫీజులను భారీగా పెంచిన ప్రభుత్వం, వైద్య విద్యార్థుల ఆందోళనతో కొంత మేర తగ్గించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోకు సవరణలు చేస్తూ శనివారం నాలుగు జీవోలు జారీ చేసింది. అడ్మిషన్ల కమిటీకి 50 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీపై మార్గదర్శకాలను, డెంటల్ కోర్సుల ఫీజులు, మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు సంబంధించి వేర్వేరు జీవోలను జారీ చేసింది. ఫీజులపై విద్యార్థులు ఆందోళన చేసిన సమయంలో మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందిస్తూ పీజీ మెడికల్ విద్యార్థికి 30 వేల రూపాయలు, పిజి డెంటల్ విద్యార్థికి 25 వేల రూపాయల చొప్పున నెలకు స్టైపెండ్ చెల్లించేందుకు వీలుగా కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి ఫీజును పెంచినట్లు తెలిపారు. కానీ తాజాగా జారీ చేసిన జీవోల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు మాత్రమే స్టైపెండ్ అంశం పరిమితమైందని ఎపి జూనియర్ డాక్టర్ సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. కన్వీనర్ కోటా సీట్లకు స్టైపెండ్ గురించి జీవోలో ప్రస్తావించకపోవడం విద్యార్థులను మోసం చేయడంగా ఎపి జూనియర్ వైద్య సంఘం ప్రతినిధి ఠాగోర్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల తమకు సంతృప్తి లేదని, విద్యార్థుల కన్నా, ప్రైవేట్ వైద్య కళాశాలల గురించే ఎక్కువగా పట్టించుకుంటున్నారని విమర్శించారు. కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులకు స్టైపెండ్ చెల్లింపులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీజుల వ్యవహారం తమ పరిధిలోనిది కాదంటూ మాట్లాడేందుకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు నిరాకరించడం గమనార్హం. కాగా మంత్రి కామినేని స్పందిస్తూ ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఫీజులను నిర్ణయించామని తెలిపారు. కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా విద్యార్థులందరికీ స్టైపెండ్ చెల్లిస్తారని, ప్రత్యేకంగా దీని గురించి ఉత్తర్వుల్లో పేర్కొనాల్సిన అవసరం లేదన్నారు.