ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం స్మగ్లర్ శివలింగం అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 10 : కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గత వారం రోజులుగా ఓఎస్‌డి సత్యయేసుబాబు నేతృత్వంలో పోలీసు అధికారులు, సిబ్బంది దాడులు చేసి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ శివలింగం శ్రీ్ధర్‌తో పాటు మరో 14 మంది అరెస్టు చేశారు. అలాగే వారి నుంచి ఎర్రచందనం దుంగలు, వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఓఎస్‌డి నేతృత్వంలో బి.కోడూరు, పోరుమామిళ్ల, ఖాజీపేట, తదితర ప్రాంతాల్లో డీఎస్పీలు విఆర్ శ్రీనివాసులు, బి.శ్రీనివాసులు, సిఐలు పద్మనాభం, పుల్లయ్య, ఎస్‌ఐలు రంగారావు, విద్యాసాగర్, పెద్దఓబన్న, మద్దిలేటి, హేమకుమార్, కొండారెడ్డి, స్పెషల్‌పార్టీ సిబ్బంది గత వారం రోజులుగా శేషాచలం, లంకమల అభయారణ్యంలో మకాం వేసి మరీ రెక్కీ నిర్వహించి అనంతరం దాడులు చేశారు. ఈ దాడుల్లో గల్ఫ్ దేశమైన దుబాయ్‌కి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సాహుల్‌భాయ్ ప్రధాన అనుచరుడైన, కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన శివలింగం శ్రీ్ధర్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన విక్రమ్‌బాయ్, కడప జిల్లాలోని పెండ్లిమర్రి నాగాయపల్లెకు చెందిన అబ్బిరెడ్డి నరసింహారెడ్డి, పోరుమామిళ్ల అక్కల్‌రెడ్డిపల్లెకు చెందిన ఎం.బాలరంగయ్య, దాసరిపల్లె మైఖేల్, దాసరి బాబు, డెక్కల గురయ్య, యాదవ నసానియల్, ఓబులాపురం రమేష్, దాసరిపల్లె కిరణ్ ఓబులాపురం ఆరోగ్యం, పెండ్లిమర్రి మండలం ఎల్లటూరుకు చెందిన గుర్రంపాటి ఈశ్వరరెడ్డి, పోరుమామిళ్ల కొర్రపాటుపల్లెకు చెందిన భక్తుల అల్లూరయ్య, పోరుమామాళ్లపల్లె ముసల్‌రెడ్డిపల్లెకు చెందిన రాధాసిద్దయ్యలను అరెస్టు చేశారు. ఆ స్మగ్లర్లు దుబాయ్ సాహుల్‌భాయ్ ఆదేశాల మేరకు ఎర్రచందనాన్ని గోడౌన్లలలో భద్రపరచి కంటైనర్ల ద్వారా నౌకల్లో దుబాయ్, మలేషియా, హాంగ్‌కాంగ్, సింగపూర్, చైనా, తదితర దేశాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఎర్రచందనాన్ని తరలించేవారు.