ఆంధ్రప్రదేశ్‌

చిన్నారులను బలిగొన్న గ్రావెల్ గుంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, మే 10: బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు గ్రావెల్ గుంటలో పడి మృత్యువాత చెందగా, మరొక చిన్నారి సురక్షితంగా బయట పడిన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ పరిథిలోని గొట్లపాళెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గొట్లపాళెం గ్రామానికి చెందిన ఉండ్రాళ్ల సురేష్ (12) అస్తోటి జాన్ (10) మరొక చిన్నారి కోలా నవీన్ కుమార్ ముగ్గురూ వీధిలో అటలాడుకుంటున్నారు. ఇంతలో బహిర్భూమికి వెళ్లాల్సి రావటంతో అందరు కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న ఒరవ కాలువకు అనుకుని ఉన్న గ్రావెల్ గుంట వద్దకు వెళ్లారు. బహిర్భూమికి వెళ్లిన తరువాత నీటి కోసం ముందుగా సురేష్, జాన్ గుంట వద్దకు వెళ్లగా, అక్కడ నీటి కోసం వంగి కాలు జారీ గుంతలో పడిపోయారు. కొద్ది సేపటి తరువాత నీటి కోసం వచ్చిన నవీన్ కుమార్ గుంటలో చూడగా సురేష్, జాన్‌లు పైకి కిందకు మునుగుతూ తెలుతూ కనిపించారు. దీంతో అందోళన చెందిన నవీన్ కుమార్ వెంటనే అక్కడి నుంచి కేకలు వేసుకుంటు గ్రామంలోకి వెళ్లి సమాచారం అందించాడు.