ఆంధ్రప్రదేశ్‌

డిజైన్ల పరిశీలనకు మంత్రుల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 10: రాజధాని అమరావతిలో వివిధ ఐకానిక్ భవనాలు సహా ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్సుకు సంబంధించి డిజైన్ల పరిశీలనకు మంత్రుల బృందంతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధాని అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, ప్రముఖుల వసతి భవనాలు ప్రభుత్వ కాంప్లెక్సులో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లండుకు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ హైకోర్టు, అసెంబ్లీ, ప్రభుత్వ భవనాల కాంప్లెక్సుకు డిజైన్లను సిద్ధం చేస్తోంది. రెండు డిజైన్లను ముఖ్యమంత్రికి చూపించినప్పటికీ, అమెరికా పర్యటన తరువాత ఖరారు చేద్దామని సిఎం చెప్పారు. దీంతో మరింత మెరుగులు దిద్దే పనిలో ఆ సంస్థ ఉంది. ఈ నేపథ్యంలో డిజైన్లను పరిశీలించి, మార్పులను సిఫారసు చేసేందుకు వీలుగా ఒక మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌లతో ఈ బృందం పని చేస్తుంది. పురాపాలక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ మెంబర్ -సెక్రటరీగా వ్యవహరిస్తారు.