ఆంధ్రప్రదేశ్‌

వామపక్షాల విలీనం అసాధ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 10: ఇటీవలి కాలంలో ఏ ఉద్యమంలో చూసినా వామపక్షాల ఐక్యత వర్థిలాలి.. అనే నినాదాలు మార్మోగుతున్నప్పటికీ వామపక్షాల విలీనం మాత్రం సాధ్యపడేది కాదని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తేల్చిచెప్పారు. కార్ల్‌మార్క్స్ ద్విశతాబ్ది జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం నగరానికి వచ్చిన ఏచూరి మీట్ ది ప్రెస్‌లో, సురవరం సిపిఐ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలోనూ మాట్లాడారు. మీట్ ది ప్రెస్‌లో ఏచూరి మాట్లాడుతూ సిపిఐ, సిపిఎం మధ్య నేటికీ కొన్ని అంశాలపై విభేదాలున్నాయని చెప్పారు. అయినా పైస్థాయిలో నేతలంతా ఒక్కటై కలిసి పనిచేసినంత మాత్రాన క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలుస్తారనుకోవటం భ్రమే అవుతుందన్నారు. అయితే ప్రజాసమస్యలపై ప్రస్తుతం తమ రెండు పార్టీలు, ప్రజాసంఘాలు కలసికట్టుగా పోరాడుతున్నాయన్నారు. అయితే విలీనం మాత్రం సాధ్యపడదని ఏచూరి తేల్చిచెప్పారు. సురవరం మాట్లాడుతూ వామపక్షాల విలీనం పట్ల తమకెలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే సిపిఎం నుంచి కూడా సంకేతాలు రావాలి కదా అని అన్నారు. ఈ విషయంలో స్పందించాల్సింది సిపిఎం అని అన్నారు. విలీనం వేరు, ఐక్య కార్యాచరణ వేరని చెప్పారు. వామపక్షాల ఐక్యత కోసం తగిన కార్యాచరణతో ముందుకు సాగాల్సి ఉందని సురవరం పేర్కొన్నారు. రెండు పార్టీల ప్రధాన కార్యదర్శులుగా వున్న వీరిద్దరూ తెలుగు రాష్ట్రాలకే చెందిన నేతలు కావటం గమనార్హం.