ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన అమెరికా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 12: అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్న సిఎం, రాత్రికి విజయవాడ చేరుకున్నారు. ప్రముఖ ఐటి కంపెనీల సిఇఒలతో, పారిశ్రామివేత్తలతో వరుస భేటీలతో అక్కడ బిజీబిజీగా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని సంస్థలు ఒప్పందాలు చేసుకునేందుకు ముందుకు రావడం గమనార్హం. ఏడు రోజుల్లో ఏడు వేల కిలోమీటర్ల పైగా అమెరికాలో పర్యటించారు. అమెరికాలో 15 నగరాల్లో పర్యటించి, 30 సమావేశాల్లో పాల్గొన్నారు. 90 కంపెనీల ప్రతినిధులతో సిఎం చర్చలు జరిపారు. అమెరికా పర్యటనలో వ్యవసాయం, ఐటి పరిశ్రమల రంగాల్లో పలు కీలక ఒప్పందాలను చేసుకున్నారు. అమెరికాలో కుదుర్చుకున్న వివిధ ఒప్పందాల కారణంగా రాష్ట్రంలో దాదాపు 1.25 లక్షల మేరకు ఉద్యోగాలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలతో ప్రత్యేకంగా ఆయన సమావేశమయ్యారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఇదే సమమని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారికి పిలుపునిచ్చారు. అమెరికన్ కంపెనీల ప్రతినిధులకు రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు, వనరులు, ఇతర సౌకర్యాల గురించి వివరించి పెట్టుబడులకు ఇదే మంచి తరుణమన్న పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటివి వినియోగించడం ద్వారా పాలనలో పారదర్శకత పెంచుతున్నామని వివరించారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, ప్రపంచంలోని అత్యున్నత విధానాలను ఇక్కడ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించారు. బెల్, డెల్, యాపిల్ తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరించడం ఈ పర్యటనలో కీలకాంశంగా చెప్పవచ్చు. యుఎస్‌ఐబిసిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ట్రాన్స్‌ఫర్మేటివ్ సిఎం అవార్డును, లైట్ ఆఫ్ ది లైఫ్ అవార్డును అందుకున్నారు. అమెరికా యాత్ర ఫలవంతమైందన్న అభిప్రాయం సిఎంఓ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.