ఆంధ్రప్రదేశ్‌

మైనార్టీల హక్కులను తాకట్టుపెట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 13: వైసిపి అధ్యక్షుడు జగన్ రాజకీయాల్లో సైద్ధాంతిక దివాళాకోరుతనంతో తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్ల వద్ద మైనార్టీల హక్కులను తాకట్టుపెట్టారని ఏపి స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ ధ్వజమెత్తారు. శనివారం విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో మైనార్టీ ఓట్ల కోసం బిజెపిని వ్యతిరేకించిన జగన్ ఈ మూడు సంవత్సరాల వ్యవధిలోనే యూటర్న్ తీసుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన అనంతరం ఏకపక్షంగా ప్రత్యేక హోదా తప్ప అన్ని విషయాల్లో బిజెపి విధానాలను సమర్థిస్తున్నానని చెప్పడం రాజకీయ దివాళాకోరుతనమన్నారు. బిజెపి పార్టీకి కామన్ సివిల్ కోడ్, ముస్లిం రిజర్వేషన్లు వంటి విషయాల్లో ఒక విధానం ఉందని, ఆ విషయాలతో జగన్‌మోహన్‌రెడ్డి ఏకీభవిస్తున్నారో లేదో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మడమతిప్పని నేతగా ప్రగల్బాలు పలికిన జగన్‌మోహన్‌రెడ్డి రహస్యంగా ప్రధాని నరేంద్రమోదీని ఎందుకు కలవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. బిజెపి నాయకులు సోము వీర్రాజు లాంటి వారు కూడా ప్రధానమంత్రిని కలిస్తే తప్పేంటి అని అంటున్నారని, దాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపట్టడం లేదన్నారు.
బిజెపి సైద్ధాంతిక విధానాన్ని వైసిపి కూడా అవలంబిస్తోందని మాత్రమే తాము చెబుతున్నామన్నారు. 2014 ఎన్నికల్లో బిజెపిని మతతత్వ పార్టీ అని విమర్శించిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీ కాళ్లపై పడి, అనంతరం బిజెపిని సమర్థించడంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర విషయాల ప్రయోజనాల దృష్ట్యా 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు కుదుర్చుకున్నారన్నారు. మీరు ప్రధానమంత్రి మోదీతో, బిజెపితో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మా పార్టీ అధినాయకుడు బిజెపి పొత్తుపై స్పష్టంగా చెప్పారని, మీరు కూడా బిజెపితో కలసి పనిచేస్తామని, సెక్యులర్ విధానాలను వదులుకున్నామని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలా చెప్పకపోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడంతోపాటు ముస్లిం, క్రైస్తవ మైనార్టీ ప్రజలను మోసగించడమేనని తెలియజేశారు.
మీ చర్యల వల్ల మైనార్టీ ప్రజలను నడిసముద్రంలో వదిలివేసినట్లైందన్నారు. గతంలో మీ తండ్రి హైదరాబాదులో మత కలహాలు సృష్టించి 30 మంది మైనార్టీ సోదరులు మృతికి కారకులయ్యారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో రాష్ట్రంలో మైనార్టీలపై ఎక్కడా దాడులు జరగలేదన్నారు. సమావేశంలో కృష్ణాజిల్లా డైరెక్టర్ మొయినుద్దీన్, విజయవాడ, గుంటూరు మైనార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు, మైనార్టీ సెల్ ప్రతినిధి ఎండి ఇర్ఫాన్ పాల్గొన్నారు.