ఆంధ్రప్రదేశ్‌

మీకు ఉలుకెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 13: ప్రధాని నరేంద్రమోదీని జగన్ కలిస్తే టిడిపి నేతలకు ఉలుకెందుకని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్, మోదీ కలయికపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత, దేశ ప్రధానిని కలిసి తమ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు వివరించడంతో పాటు రైతులు పడుతున్న ఇబ్బందులు తది అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అత్యవసరమని, హోదాతోనే అభివృద్ధి జరుగుతుందని జగన్ ప్రధాని మోదీకి వివరించారన్నారు. అలాగే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, గిట్టుబాటు ధరలు లభించక, రైతులు నష్టపోతున్నారని, వీరిని కేంద్రం అదుకోవాలని కోరారన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించి, వారికి మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉందని, అగ్రిగోల్డ్ వ్యవహారంలో డిపాజిట్ దారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ కుంభకోణంలో అధికార టిడిపి ముఖ్యనేతలు, మంత్రులు, ఇతర నాయకుల ప్రమేయం ఉందని జరిగిన వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని మోదీని కోరారన్నారు. అలాగే రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్‌డిఎ బలపరిచే అభ్యర్థికి తాము మద్దతిస్తామని ప్రధానికి హామీ ఇచ్చారని, రాజ్యాంగ బద్దమైన కీలక పదవికి పోటీ పెట్టడం మంచి సంప్రదాయం కాదనే ఈ నిర్ణయం తీసుకున్నామని, గతంలో యుపిఎ ప్రభుత్వం నిలిపిన ప్రణబ్ ముఖర్జీ ఎన్నిక విషయంలో కూడా తాము ఇదే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ఇవన్నీ బహిరంగంగా జరిగిన అంశాలేనని, వీటిని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.