ఆంధ్రప్రదేశ్‌

ఆ సొమ్ములు ఎవరివి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 13: కోట్ల రూపాయల హవాలా చేసి, పోలీసులకు చిక్కిన మహేష్‌కు అంత భారీ మొత్తాన్ని ఎవరు ఇచ్చారు? వందల కోట్ల రూపాయలు దేశం దాటించేంత అవసరం ఎవరికుంది? దీని వెనుక పెద్ద మనుషుల హస్తం ఉందన్న కథనాలు వినిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాల తరువాత బ్లాక్ మనీని ఇతర దేశాలకు తరలించేందుకు అక్కడక్కడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగమే ఇది అని తెలుస్తోంది. కొంతమంది రాజకీయ ప్రముఖుల హస్తం ఇందులో ఉందన్న కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై డిసిపి నవీన్ గులాటి శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లడుతూ ఇది కేవలం 680 కోట్ల రూపాయలతో ఆగిపోతుందని తాము భావించడం లేదు. ప్రాథమికంగా మాత్రమే ఈ మొత్తం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికి 12 ఫేక్ కంపెనీలు వెలుగు చూశాయి. ఇవి మరిన్ని పెరిగే అవకాశం ఉందని అన్నారు. అలాగే, దీనివెనుక ఎవరెవరు ఉన్నారన్నది తెలుసుకోడానికి మరో రెండు రోజుల వ్యవధి పడుతుందని ఆయన తెలియచేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న హవాలా కుంభకోణం వెనుక పెద్దల హస్తం ఉందన్నది వాస్తవం. ఈ కేసు సిబిఐ చేతికి వెళితే, దీనివెనుక ఉన్న పెద్ద మనుషులంతా వెలుగులోకి వస్తారు. అందుకే సిబిఐకి కాకుండా ఈ కేసును సిఐడితో సరిపెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆదాయ పన్ను శాఖను, జాతీయ బ్యాంకులను మోసం చేసిన కేసులను సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో సిబిఐని ఎందుకు రంగంలోకి దించడం లేదో అర్థం కావడం లేదు.