ఆంధ్రప్రదేశ్‌

రాజధానిలో ఇండో-యుకె ఆస్పత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 26: రాజధాని అమరావతిలో సుమారు వెయ్యి కోట్లతో 1100 పడకల అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించడానికి ఇండో యుకె ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కింగ్స్ కాలేజీ సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎం చంద్రబాబు నాయుడిని ఈ బృందం కలిసి కింగ్స్ కాలేజీ హాస్పిటల్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందచేసింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ ఆసుపత్రితోపాటు మరో 10 ఆసుపత్రులను పై సంస్థ నిర్మించనుంది. లివర్ వ్యాధుల చికిత్సలో ప్రపంచ స్థాయి ఆసుపత్రిగా గుర్తింపు తెచ్చుకున్న కింగ్స్ కాలేజీ గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల నేపథ్యంలో ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. అమరావతిలో కేవలం ఒక్క ఆసుపత్రి నిర్మిస్తే గొప్పకాదని, కేంద్ర ప్రభుత్వం యుకెతో చేసుకున్న ఒప్పందం మేరకు 11 వైద్య విజ్ఞాన సంస్థలు, మెడికల్ కాలేజీలు దేశంలో నెలకొల్పుతున్నారని చంద్రబాబు చెప్పారు. ఈ సంస్థలకు సంబంధించిన కేంద్ర కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటవుతున్నాయని, వీటి ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో ఏర్పాటు చేసే ప్రపంచ స్థాయి అధునాతన ఆసుపత్రి ఐకాన్‌గా ఉండాలని, ప్రధాన భవనాన్ని సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా నిర్మించాలని చంద్రబాబు నాయుడు యుకే బృందాన్ని కోరారు. అమరావతిలో నిర్మించనున్న ఈ ఆసుపత్రి భవన నిర్మణానికి జూన్ ఐదు లేదా తొమ్మదో తేదీన శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ వస్తున్నారని చంద్రబాబు తెలియచేశారు. యుకెలో వైద్య ఆరోగ్య విధానాల గురించి యుకె బృందాన్ని సిఎం చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు.