ఆంధ్రప్రదేశ్‌

విందు భోజనం వికటించి 250 మందికి అస్వస్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ రూరల్, మే 13: గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామంలో శుభకార్యం సందర్భంగా ఏర్పాటు చేసిన విందు భోజనం వికటించి 250 మంది అస్వస్థత పాలయ్యారు. ఆలస్యంగా తెలిసిన వివరాల మేరకు.. ఏనుగుపాలెం గ్రామానికి చెందిన పాపసాని శ్రీనివాసరావుకు ఈనెల ఆరో తేదీన తిరుమలలో వివాహం జరిగింది. ఈ సందర్భంగా 11వ తేదీ గురువారం ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. స్థానికులతో పాటు బంధువులు, స్నేహితులు విందుకు హాజరయ్యారు. దాదాపు 500 మందికి పైగా అతిధులు భోజనాలు చేశారు. వీరిలో చాలామంది మరుసటి రోజు శుక్రవారం మధ్యాహ్నం నుండి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. తిరిగి శనివారం ఉదయానికి మళ్లీ పెద్ద సంఖ్యలో బాధితులు ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే విందుకు హాజరైన వివిధ గ్రామాలకు చెందిన బంధువులు, మిత్రులు కలిసి మొత్తమీద 250 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఇదిలా ఉండగా గ్రామస్ధులంతా కదలిరావడంతో ఏనుగుపాలెం గ్రామ పిహెచ్‌సీ కిటకిటలాడింది. ఆసుపత్రి ఆవరణలో షామియానాలను ఏర్పాటు చేసి, రోగులకు సెలైన్లు ఎక్కించారు. విష ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చినట్టు సమాచారం అందుకున్న వైద్యశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమై గుంటూరు నుండి రాపిడ్ రిస్క్ టీం బృందానికి చెందిన డాక్టర్ ఎస్ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఎస్ గణేష్, ఎం శ్రీనివాసరావులతో పాటు డెప్యూటీ డిఎం అండ్ హెచ్‌వో డాక్టర్ మురళీకృష్ణ ఏనుగుపాలెం వచ్చి వైద్య చికిత్సలను పరిశీలించారు. పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ గోగినేని సాంబశివరావు తదితరులు ఆసుపత్రికి చేరుకుని, బాధితులను పరామర్శించారు.