ఆంధ్రప్రదేశ్‌

గుంపుల రవికుమార్ అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ఆంధ్రప్రదేశ్ నందికొట్కూరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గుంపుల రవికుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఆయన మృతి అనుమానాస్పదంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనగర్ కాలనీకి చెందిన జి. రవికుమార్ (35) ప్రైవేట్ ఉద్యోగి. ఆయన స్వస్థలం కర్నూలు కాగా శనివారం ఉదయం రవికుమార్ తన గదిలో మృతి చెంది కనిపించారు. రక్తపు విరేచనాలు, వాంతులతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో రవికుమార్ అనారోగ్యంతో మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఎన్నిక చెల్లదని రవికుమార్ ఇటీవల హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో రవికుమార్ మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.