ఆంధ్రప్రదేశ్‌

బిటి ఆవాలకు అనుమతి ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 13: అన్ని వర్గాల ప్రజలు వినియోగించే ఆవాలపై కూడా కనే్నసిన కార్పొరేట్ శక్తులు బిటి పత్తి విత్తనాల తరహాలో బిటి ఆవాల విత్తనాల ఉత్పత్తి కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి దినేష్ కులకర్ణి ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు కేంద్ర పర్యావరణ శాఖ అనుబంధ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ రెండురోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్ చేసిందని తెలిపారు. పర్యావరణం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ సిఫార్సులను ఎలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రం ఆమోదించరాదని కోరారు. లేనిపక్షంలో ఇతర రైతు సంఘాలతో కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. త్వరలోనే దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మిథున్‌ను కలవనున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శనివారం నగరంలో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమావేశంలో కులకర్ణి మాట్లాడారు. ఆవాల పొడి, కారం పచ్చళ్లలో వాడతామని, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆవ నూనె వినియోగిస్తారన్నారు. విత్తన మార్పిడి జరిగితే తొలుత దిగుబడులు అధికంగా కన్పించినప్పటికీ మున్ముందు విత్తనాల కోసం మన రైతులు కార్పొరేట్ కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. భూమి నిస్సారవౌతుందని తెలిపారు. వాస్తవానికి ఏడుతరాల పాటు అన్నిరకాల పరిశోధనలు చేయాల్సి ఉండగా అవేవీ లేకుండా విత్తన మార్పిడికి ఎలా సిఫార్స్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. గత యుపిఏ ప్రభుత్వ హయాంలో బిటి వంకాయ విత్తనాల ఉత్పత్తికి ప్రయత్నం జరగ్గా తాము తీవ్రంగా వ్యతిరేకించడంతో దేశంలో తొమ్మిది ప్రాంతాల్లో రైతుల అభిప్రాయ సేకరణ జరిపారన్నారు. తర్వాత రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతను చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని గుర్తుచేశారు. తిరిగి విత్తనం పుట్టని వెరైటీని రైతులపై రుద్దాలనుకోవటం శోచనీయమని దినేష్ కులకర్ణి నిరసించారు. సమావేశంలో సంఘం జాతీయ కార్యదర్శి సాయిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జి రాంబాబు, ఉపాధ్యక్షులు చంద్రశేఖరరెడ్డి, వంగల సిద్దారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.