ఆంధ్రప్రదేశ్‌

మర్యాదే మన ఉన్నతిని పెంచుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 13: ఫిర్యాదు పట్ల మర్యాదగా వ్యవహరించాలని, మర్యాదే శాఖ ఉన్నతిని పెంచుతుందని డిప్యూటి సి ఎం, రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లాల వారీ క్రైమ్ సమీక్ష నిర్వహిస్తున్న హోం మంత్రి శనివారం రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలీసులపై రాజకీయ వత్తిళ్లకు తావులేకుండా చూస్తామన్నారు. ఏదైనా ఫిర్యాదు వస్తే తక్షణం స్పందిస్తే ఫలితం ఉంటుందని, ఎటువంటి పరిస్థితుల్లోనూ తాత్సారం వద్దని వాడి వేడిగా సమీక్షించినట్టు సమాచారం. బదిలీల వ్యవహారంలో చేతులు మారినట్టు తెలిస్తే ఇచ్చినవారిపై క్రమ శిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది. సుమారు మూడు గంటల పాటు నిశితంగా అన్ని కోణాల్లోనూ సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను సీరియస్‌గా పరిగణించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని, ముందస్తు నిఘాతో వ్యవహరిస్తే శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలిగదని, నిరంతర నిఘా, గూడచర్యం, అప్రమత్తత అలవర్చుకోవాలన్నారు. అర్బన్ జిల్లా పరిధిలోని ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో డిఎస్పీలు, సిఐలతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతలు కాపాడటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. శాంతిభద్రతలు వుం టేనే సంక్షేమానికి సానుకూల పరిస్థితి ఉంటుందన్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్, భూ కబ్జా కేసులు, గంజాయి రవాణా ఇటువంటి కేసులన్నీ తగ్గాయన్నారు.
రోడ్డు ప్రమాదాలను తీవ్రంగా పరిగణించామని, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, జిల్లా పరిషత్ రోడ్లలో బ్లాక్ స్పాట్‌లను గుర్తించామన్నారు. ఆర్ అండ్ బి, రవాణా శాఖ, పోలీసు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయన్నారు. శాంతిభద్రతలు సజావుగా ఉంటేనే ప్రాజెక్టులు వస్తాయని, ప్రశాంత వాతావరణం ఉంటేనే సంక్షేమం సాధ్యమవుతుందని, అందుకే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని తుదముట్టిస్తామని, పోలీసు అధికారులను క్షేత్ర స్థాయి పరిధులను బట్టి ఆయా అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకున్నామన్నారు. మహిళా కేసుల పట్ల కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కేసుల్లో ఉన్నవారిని విడిపించాలని రాజకీయ వత్తిళ్ళు లేకుండా వుంటాయన్నారు. 2016లో వివిధ కేసులు 525 వుంటే 2017లో ఇప్పటి వరకు 167 కేసులు మాత్రమే వున్నాయన్నారు. 2016లో 3400 కేసుల్లో ఎఫ్‌ఆర్‌ఐలు పడితే, ఈ ఏడాది ఇప్పటి వరకు 1162 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదైందన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో రౌడీయిజాన్ని అణచివేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించామన్నారు. నేరాల సంఖ్య బాగా తగ్గిందన్నారు. ఈ సమీక్షలో అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, డిఎస్పీ, సిఐలు పాల్గొన్నారు.

చిత్రం..సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న హోం మంత్రి చినరాజప్ప