ఆంధ్రప్రదేశ్‌

మనోధైర్యాన్ని కోల్పోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 13: చేతికందొచ్చిన కొడుకు మరణించడం ఎంతో బాధాకరమని, ఈ లోటు ఎవరూ పూడ్చలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడ్ని కోల్పోయిన మంత్రి పొంగూరు నారాయణ అతని కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా శనివారం పరామర్శించారు. హెలికాప్టర్‌లో శనివారం 11.40ని.లకు తన సతీమణి భువనేశ్వరి, మంత్రి యనమల రామకృష్ణుడులతో కలిసి ఆయన నెల్లూరుకు చేరుకున్నారు. అనంతరం నారాయణ ఇంటికెళ్లిన చంద్రబాబు నారాయణ కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థల డైరక్టర్ అతి చిన్న వయసులో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న తరుణంలో జరిగిన ఇటువంటి దురదృష్టకర సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. సింగపూర్‌లో చదువుతున్న రోజుల్లోనే వారంలో చివరి రెండు రోజులు తమ గ్రూపు సంస్థల కార్యకలాపాలను నిర్వహిస్తూ అప్పట్నుంచే వ్యాపార దృక్పథం కలిగిన వ్యక్తి నిషిత్ అని అన్నారు. ఒక ఆశయం కోసం నారాయణ స్థాపించిన విద్యాసంస్థలు లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఆయన మనోధైర్యాన్ని కోల్పోకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లోనూ ఎంతో సదుద్దేశ్యంతో విభజనలో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న నారాయణకు ఆయన సంస్థల ఉద్యోగులు, ప్రజలు అన్ని విధాలా సహకరించాలని పిలుపునిచ్చారు. అండగా ఉండాల్సిన సమయంలో కుమారుడు దూరమవడం ఎంతో బాధాకరమని, సంఘటన జరిగిన సమయంలో తాను అమెరికా పర్యటనలో ఉన్నందున, తిరిగి వచ్చిన వెంటనే ఇక్కడకు వచ్చానన్నారు. అంతక్రితం సంఘటన తాలూకూ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి నారాయణ భార్య రమాదేవిని ఓదార్చారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు రోడ్డు మార్గాన నెల్లూరు చేరుకొని నారాయణ కుటుంబసభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రముఖుల పరామర్శ
పురపాలక మంత్రి నారాయణను శనివారం పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కలిసి కుమారుడి మృతి పట్ల సానుభూతి తెలియచేశారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ నారాయణను ఆయన నివాసంలో కలుసుకొని తన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని, ఎవరికి అటువంటి పరిస్థితి రాకూడదని, నారాయణ కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలా మనో ధైర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి నారాయణను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ఎదిగి వచ్చిన కొడుకు కోల్పోవడం ఏ తండ్రికైనా ఎంతో దిగ్భ్రాంతి కలిగించే విషయమని, ఆయన కుటుంబానికి భగవంతుడి అండదండలు ఉండాలని ఆకాంక్షించారు.

చిత్రాలు..నిషిత్ నారాయణ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు