ఆంధ్రప్రదేశ్‌

ఢిల్లీలో చక్రం తిప్పుతున్న విజయసాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 14: రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ప్రధాని మోదీ - వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భేటీ వెనుక రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. కొద్దికాలం నుంచీ ఢిల్లీ రాజకీయాల్లో తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్న విజయసాయి తాజాగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జగన్ ప్రధానిని కలిసేందుకు ఇప్పటివరకూ అనేకసార్లు అపాయింట్‌మెంట్ అడిగినా ప్రధాని కార్యాలయం స్పందించలేదు. దానికి టిడిపి నాయకత్వంతో మానసిక అనుబంధమున్న రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రి ప్రభావం పీఎంవోపై ఉందని గ్రహించిన విజయసాయి, సదరు కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో లేని సమయంలో ప్రధానితో భేటీ జరిపించి అందరినీ విస్మయపరిచారు. ప్రధానితో తమ నేత అపాయింట్‌మెంట్‌ను ఇద్దరు కేంద్ర మంత్రులు అడ్డుకుంటున్నారని, పీఎంవోను సమయం అడిగిన ప్రతిసారీ ఆ విషయం వారికి తెలిసి అడ్డుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తాయ. ఈసారి అలాంటి అవకాశం లేకుండా విజయసాయి వ్యూహాత్మకంగా వ్యవహరించి భేటీ విషయాన్ని చివరివరకూ సొంత పార్టీ వారికీ లీక్ చేయకుండా అత్యంత గోప్యత పాటించారు. విజయసాయి కృషి ఫలితంగానే కీలక భేటీ జరిగిందని పార్టీ వర్గాలు వివరించాయి. చివరకు మీడియాకు సైతం భేటీ జరిగిన తర్వాతనే సమాచారం ఇవ్వడం గమనార్హం. ప్రధానితో జగన్ భేటీని ప్రశ్నించిన చంద్రబాబు కూడా చివరివరకూ అపాయింట్‌మెంట్ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నించడం ప్రస్తావనార్హం. దీన్నిబట్టి గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భేటీ విషయంలో విజయసాయిరెడ్డి ఏ స్థాయిలో గోప్యత పాటించారో స్పష్టమవుతోంది. అయితే ప్రధానితో అపాయింట్‌మెంట్ ఇప్పించడంలో రాష్ట్రానికి చెందిన ఓ బిజెపి నేత రాయబారం నడిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయసాయి ఎంపి అయినప్పటి నుంచీ పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి నాయకత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో బాబుకు దగ్గరగా వుండే ఓ కేంద్ర మంత్రి అటు విజయసాయితోనూ సన్నిహితంగా మెలుగుతుండటం విశేషం. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కీలక పార్టీల నేతలతో చర్చలు, జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు కొందరితో కూడా ఆయన టచ్‌లో ఉంటున్నారు. అంతకుముందు ఈ బాధ్యతలు జగన్ సమీప బంధువైన ఎంపి సుబ్బారెడ్డి చూసేవారు. ముఖ్యంగా బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, ఆయనకు సన్నిహితంగా ఉన్న బిజెపి నేతలతో విజయసాయి సత్సంబంధాలు నెరుపుతున్నారు. కొద్దికాలం క్రితం వరకూ ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసిన ఒంగోలు ఎంపి, జగన్ బంధువైన వైవి సుబ్బారెడ్డి ఇకపై బెజవాడలో పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆమేరకు ఆయన విజయవాడలో ఇల్లు కూడా తీసుకున్నారని, జగన్ ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. డిసెంబర్ నాటికి జగన్ కూడా విజయవాడలోనే నివాసం ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.