ఆంధ్రప్రదేశ్‌

ప్రధానిపై నిఘా పెడుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 14: ప్రధాని మోదీ-వైసీపీ అధ్యక్షుడు జగన్ భేటీకి పెడార్ధాలు తీయడం మంచిది కాదని, లోపల వారిద్దరు ఏం మాట్లాడుకున్నారన్న విషయంపై తెలుగుదేశం నాయకులు, మంత్రులు చెప్పడం బట్టి టిడిపి.. ప్రధాని-ఆయన కార్యాలయం-నివాసంపై నిఘా పెడుతున్నట్లు అనుమానించాల్సి వస్తుందని మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిశారని, మరి అప్పుడు ఏ రహస్య అజెండాతో కలిశారని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తమకు టిడిపితో సైద్ధాంతిక విబేధాలు, ప్రజాసమస్యలకు సంబంధించిన వ్యవహారాల్లో తేడాలే తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదన్న కన్నా వివిధ అంశాలపై ఆంధ్రభూమి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వైసీపీలో చేరిక, బిజెపి-జగన్ కలిస్తే తమకే లాభమన్న ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు, బాబు-వెంకయ్య దేశంలో లేని సమయంలో జగన్ భేటీ జరిగిందన్న విశే్లషణ తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. అవన్నీ ఆయన మాటల్లోనే..
‘ మోదీ-జగన్ భేటీని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. అది సాధారణ ప్రక్రియ. పీఎం అపాయింట్‌మెంట్ అనేది వారి సమయం, వెసులుబాటు బట్టి ఇస్తుంటారు. పీఎం ఎవరిని కలవాలన్నది ఆయన ఇష్టం. కానీ, ఆయన ఎవరిని కలవాలన్నది కూడా మేమే నిర్ణయిస్తామనే వైఖరి పద్ధతి కాదు. జగన్ గత నెలలోనే అపాయింట్‌మెంట్ అడిగారని వాళ్లే చెప్పారు. మొన్న కలిశారు. లోపల ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు. బయటకువచ్చి జగన్ తమ భేటీ వివరాలు మీకే చెప్పారు. మరి ఇక అందులో రహస్యం ఏమిటో నాకు అర్ధం కావడం లేదని మంత్రులు, టిడిపి నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వీళ్లంతా మోదీ మీద నిఘా పెట్టారేమోననుకోవలసి ఉంటుంది కదా?’
‘మోదీ-జగన్ భేటీకి ఉలుకెందుకని సిద్దార్ధనాధ్‌సింగ్‌గారే అన్నారు. మా మంత్రి మాణిక్యాలరావు కూడా స్పందించారు. వీర్రాజు, పురంధ్వ్రీరిగారు స్పందించారు. ఇక మీరడిగినట్లు మేం వౌనంగా ఉంది ఎక్కడ? మోదీ కోరకుండానే రాష్టప్రతి ఎన్నికల్లో మద్దతునిస్తామన్న జగన్ అందుకు ఆయన పార్టీ కారణాలూ చెప్పారు. దానికి సంతోషించాలే తప్ప రంధ్వ్రానేషణ ఎందుకు? దీనిని మేం ఖండిస్తున్నాం. ఒక ప్రతిపక్ష నేత ప్రధానిని కలిస్తే కేసులు వీగిపోతాయనడం బట్టి, ఈ దేశ ప్రధాని బలహీనుడని చెప్పడమే కదా వాళ్ల ప్రచార లక్ష్యం? అంటే ఒక వ్యూహం ప్రకారం జగన్ పేరు చెప్పి ప్రధాని-బిజెపి ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారా అన్న అనుమానం కూడా టిడిపి వాళ్ల మాటలు బట్టి ఏర్పడుతోంది. దీనికి బాబుగారు స్పష్టత ఇస్తే మంచిది. మోదీ-జగన్ కలిసినందుకు పార్టీలోని ఓ వర్గం ఆనందంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. మాకు వర్గాలేమీ లేవు’ ‘చాలామంది బాబు, వెంకయ్యగారు దేశంలో లేని సమయంలో భేటీ జరిగిందని, రహస్యంగా భేటీ అయ్యారంటున్నారు. ఇది అవాస్తవం. పీఎం అపాయింట్‌మెంట్ ఖరారు చేసిన తర్వాత పీఎంఓ సదరు వ్యక్తులకు సమయం చెబుతుంది. దీనితో మా నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వివాదంలో ఆయనను లాగడం సరైనది కాదన్నారు?’
‘చాలాకాలం నుంచి నన్ను, సోము వీర్రాజు, పురంధ్రీశ్వరి, కావూరిని లక్ష్యంగా చేసుకుని ఒక వర్గం మీడియా, మిత్రపక్షానికి చెందిన నాయకులు విమర్శలు చేస్తున్నారు. నేను దాని లోతుల్లోకి వెళ్లను. బిజెపి వ్యక్తుల పునాదులపై పుట్టిన పార్టీ కాదు. ఒకవర్గం మీడియాకయితే ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకో నాకు అర్ధం కావడం లేదు. ఆ మీడియా నిరంతరం మా నామస్మరణ చేస్తోంది. కానీ మేం ఆ మీడియా అజెండా ప్రకారం పనిచేయం. మా పార్టీ అజెండా మాకుంది. కానీ కొందరు టిడిపి ఎమ్మెల్సీలు, మంత్రులు బిజెపితో విడిపోతేనే మంచిదని బహిరంగంగా చెబుతున్నారు. ఈరోజే పేపర్‌లో చూశా. ఒక టిడిపి ఎమ్మెల్సీ బిజెపి-జగన్ కలిస్తే తమకే మంచిదని చెప్పారు.
‘నాకు ఈ పార్టీలో మంచి గుర్తింపే ఉంది. అసంతృప్తి లేదు. మీరన్నట్లు పిసిసి అధ్యక్షుడు, సీఎం పదవి వరకూ పోటీ పడినా ఈ పార్టీలో నేను సామాన్య కార్యకర్తనే. కోర్‌కమిటీలో సభ్యుడిగా ఉన్నా. నేను పదవులు ఆశించి పార్టీలో చేరలేదు. నా గౌరవానికి వచ్చిన లోటేమీ లేదు. నేను కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నప్పుడే చెప్పా. నాకు ఇష్టమైన సీఎంలలో వైఎస్, మోదీ అని చెప్పా. అప్పటికి మోదీ ప్రధాని కూడా కాలేదు. నేను, పురంధ్రీశ్వరి వైసీపీలో చేరుతున్నామన్న ప్రచారం నేనూ విన్నా. అది వారి కోరిక కావచ్చన్నారు.’