ఆంధ్రప్రదేశ్‌

మూడు దశల్లో రాజధాని అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 14: రాజధాని ప్రాంతాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వంతో ఏపి సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1691 ఎకరాల్లో ఆర్ధికాభివృద్ధిని సాధించాలనేది ఒప్పంద సారాంశం. ఇందులో భాగంగా తొలివిడత 656 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. పూర్తిగా స్విస్‌ఛాలెంజి విధానంలో అభివృద్ధిని నిర్దేశించారు. దీంతో నూతన రాజధాని నగరం అమరావతిలో ప్రభుత్వ పరిపాలన వ్యవస్థతో ఆర్ధిక కార్యకలాపాలకు బీజం పడనుంది. సోమవారం సింగపూర్ సంస్థలతో ఒప్పందపత్రాలపై సంతకాలు చేసిన అనంతరం ఉద్ధండరాయనిపాలెంలో జరిగే బహిరంగసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూ కేటాయింపులకు సంబంధించిన లెటర్ ఆఫ్ అవార్డును సింగపూర్ కన్సార్టియంలకు బహుకరిస్తారు. స్విస్‌ఛాలెంజి మాస్టర్ డలపర్లుగా ఉన్న సింగ్‌బ్రిడ్జి సెంబకార్ప్, అసెండాస్ సంస్థలలో సింగపూర్ ప్రభుత్వానికి 74.75 శాతం వాటా ఉంది. ఇవి పూర్తిగా ఆ దేశ ప్రభుత్వరంగ సంస్థలే. అయితే తొలివిడత స్విస్‌ఛాలెంజి ప్రకారం సింగపూర్ ప్రభుత్వం గొంతెమ్మకోర్కెలు కోరింది. దీంతో పాటు ఈ విధానం సరైంది కాదంటూ ఏపికి చెందిన ఆదిత్య ఇన్‌ఫ్రా హౌసింగ్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పలు పిటిషన్లు, అప్పీళ్ల మధ్య ఈ ఏడాది జనవరి 3న జీవో 170తో పాటు స్విస్ చాలెంజి ప్రతిపాదనలో సవరణలతో గ్లోబల్ టెండర్లను మరోసారి పిలిచారు. పోటీకి సంస్థలు ముందుకు రాకపోవటంతో సింగపూర్ కన్సార్టియంలకే కట్టబెట్టారు.
ఈ కన్సార్టియం 30 ఆసియా దేశాల్లో 50 వేల కోట్ల టర్నోవర్‌తో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. అనుభవం ఉన్న సంస్థ కావటంతో రాజధాని నగర అభివృద్ధిని స్విస్‌ఛాలెంజి కింద కన్సార్టియంకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడత 656, రెండో దశలో 514, మూడోదశలో 521 ఎకరాల్లో అభివృద్ధి జరిపేందుకు రెండు ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. తొలివిడత 70 శాతం భూమిని అభివృద్ధిచేసి విక్రయించిన తరువాత రెండోదశ చేపట్టాల్సి ఉంది. అయితే భూమిని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కింద అమరావతి డవలప్‌మెంట్ ఏజన్సీ పర్యవేక్షిస్తుంది. అభివృద్ధిచేసిన ప్లాట్ల విక్రయ హక్కులు మాత్రం సీఆర్‌డిఎకు ఉండే విధంగా ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. ఈ మేరకు ఉద్దండరాయనిపాలెంలో జరిగే బహిరంగసభలో సోమవారం ఏపి సర్కార్, సింగపూర్ సంస్థల మధ్య అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో ఉద్ధండరాయనిపాలెం, మందడం, లింగాయపాలెం, కొండమరాజుపాలెం, రాయపూడి గ్రామాల్లో సింగపూర్ సంస్థలకు భూ కేటాయింపులు జరుపుతారు. ఈ ఆరు గ్రామాల్లో స్టార్టప్ అభివృద్ధిని సింగపూర్ కన్సార్టియంలు ప్రారంభిస్తాయి. రాజధాని నగరం వెలుపల వౌలిక సదుపాయాల కల్పన బాధ్యత మాత్రం అమరావతి డవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. ఇందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. సిఆర్‌డిఎ ద్వారా ఎడిసి వౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకోసం గతంలో సిసిడిఎంసి (కాపిటల్ సిటీ డవలప్‌మెంట్ మేనేజిమెంట్ కమిటీ)కి 5వేల కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు రాజధానిలో విద్యా సంస్థలకు మాత్రమే భూములు కేటాయించారు. ముఖ్యమంత్రి చైర్మన్ గా, సింగపూర్ వాణిజ్య మంత్రి మెంబర్ కన్వీనర్‌గా హైలెవల్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జెఐసిఎస్), ఇరు ప్రభుత్వాల సీనియర్ అధికారులతో జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీ (జెఐడబ్ల్యుసి) ఏర్పాటు కానున్నాయి.