ఆంధ్రప్రదేశ్‌

‘ప్రత్యేక హోదా’ అమలు షరతుతోనే... రాష్టప్రతి అభ్యర్థిని బలపర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 14: త్వరలో జరగనున్న రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డియే అభ్యర్ధి బలపరుస్తామనే రాజకీయ విధానాన్ని ప్రకటించిన టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి అధినేతలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా పై షరతుతోనే రాష్టప్రతి అభ్యర్థిని బలపర్చాలని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆదివారం ఆయా పార్టీల అధినేతలకు కాంగ్రెస్ తరఫున లేఖలు రాసిన రఘువీరారెడ్డి ఎన్డీయే కూటమి గెలిస్తే 10 ఏళ్లపాటు ప్రత్యేక హోదా అమలుచేస్తామని బిజెపి, కాదు 15 ఏళ్ళు కావాలంటూ టిడిపి తరఫున కోరుతున్నట్టు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా మాత్రం అమలు జరగకపోవడం గర్హినీయమన్నారు. అలాగే ఎన్డీయే ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా పునర్వవస్థీకరణ చట్టంలోని అంశాల అమలులో కూడా తీవ్ర అన్నాయం చేసిన విషయాన్ని గుర్తించి రాష్టప్రతి ఎన్నికల మద్దతులో షరుతు విధించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇరువురు నేతలు మోదీకి మోకరిల్లారన్న విషయం ప్రజలు బలంగా నమ్ముతున్నారని, రాష్టప్రతి అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే మద్దతు ప్రకటించడం గమనార్హమన్నారు.