ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ నేతలపై టిడిపి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, మే 14: చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఇంత జరుగుతున్నా ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ గృహ కల్పన ద్వారా కుప్పం మండలానికి సుమారు 1400 కాలనీ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసింది. ఇందులో భారీగా అవకతవకలు జరిగాయని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, తెలుగుదేశం పార్టీ నాయకుల బంధువర్గానికి కాలనీ ఇండ్లు మంజూరు చేశారని కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ సురేష్‌బాబు తదితరులు ఆరోపించారు. ఈ విషయమై ఇటీవల స్థానిక ఎస్‌వో శ్యాంప్రసాద్, తహశీల్దార్ యుగందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు నిజానిజాలు వెలికితీయాలని విచారణ చేపట్టారు. ఇదిలావుండగా కుప్పంలో జరిగిన హౌసింగ్ అక్రమాలపై చర్చా వేదిక ఏర్పాటు చేయాలని వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ సురేష్‌బాబు పిలుపునిచ్చారు.
దీనిపై టిడిపి స్పందిస్తూ ఏడు రోజులు సమయం మాకెందుకు ఇప్పుడే చర్చ కొనసాగిస్తామని అప్పట్లో సవాల్ విసిరారు. అయితే అందరికీ తెలిసినట్టుగా స్థానిక శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయ ప్రాంగణంలో ఈనెల 14వ తేదిన చర్చా వేదిక ఏర్పాటు చేద్దామని ఇరువర్గాలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగానే హౌసింగ్ లబ్ధిదారులతో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి గంగమాంబ ఆలయ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేశారు. 11.30 గంటలకు ముందుగా అనుకున్న ప్రకారం చర్చా వేదికలో పాల్గొనేందుకు సురేష్‌బాబు ఓ పది మంది కార్యకర్తలు ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారికి పూజా కార్యక్రమాల అనంతరం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు వెళ్లారు. వీరిని చూడగానే విరుచుకపడ్డ కుప్పం జడ్పీటిసి సభ్యుడు రాజ్‌కుమార్, అతని అనుచరులు, బంధువర్గం ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయారు. పోలీసుల సమక్షంలోనే సురేష్‌బాబు, అతని అనుచరులపై వారు పిడిగుద్దులు గుద్దారు. కుర్చీలతో దాడి చేశారు. కింద పడిపోయిన పలువురి కార్యకర్తలను కాళ్లతో తన్నారు. ఈక్రమంలో ఇరు వర్గాలను విడదీసేందుకు కుప్పం ఎస్సై రామస్వామితో పాటు పలువురు పోలీసులు విఫలయత్నం చేశారు.
ఇంతలో సిఐ రాజశేఖర్ కల్పించుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పి విడదీశారు. అప్పటికే ఐదుగురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర గాయాలపాలై నడవలేని స్థితికి చేరారు. ఇతరుల సహాయంతో వారు కుప్పం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి బయట బైఠాయించారు. మీ ఎదుటే తమపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీస్‌స్టేషన్‌లో భీష్మించి కూర్చుకున్నారు. సుమారు నాలుగు గంటల హైడ్రామా అనంతరం కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో సురేష్‌బాబు, అతని అనుచరులు స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
దీనిపై జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ కుప్పంలో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులు రౌడీలుగా నడిరోడ్డుపై నిజాన్ని నిలదీసిన వారిని కొట్టడం ఎంతవరకు సమంజసమని, వీరిపై వెంటనే కేసులు నమోదు చేయాలని రఘువీరా ఫోన్ ద్వారా తెలిపారు. ఇదిలావుండగా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరెడ్డి కుప్పంకు చేరుకొని గాయాలపాలైన సురేష్‌బాబును ఓదార్చి కుప్పం సిఐ రాజశేఖర్‌ను సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దీనిపై ఆయన స్పందిస్తూ సంఘటనపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన కోరారు.

చిత్రం..కాంగ్రెస్ నాయకులపై దాడికి పాల్పడుతున్న టిడిపి నాయకులు