ఆంధ్రప్రదేశ్‌

మిర్చి రైతుకు మద్దతు ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 15: మిర్చి రైతుల వెతలు తీరటంలేదు.. ప్రభుత్వాలు మద్దతు ప్రకటిస్తున్నా..ప్రతిపక్షాలు ఆందోళన చేపడుతున్నా.. గిట్టు బాటు ధర ఎండమావిగా మారుతోంది.. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5వేల మద్దతుధరతో పాటు 1250 రవాణా ఖర్చులు ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు దరి చేరలేదు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 15 వందల చంద్రన్న రాయితీ పథకంలో అడుగడుగునా రైతు దగా పడుతున్నాడు.. దీనికితోడు గుంటూరు మిర్చి యార్డుకు మంగళ వారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. వచ్చేనెల 5 తరువాతే తిరిగి కొనుగోళ్లను పునరుద్ధరిస్తారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన నాలుగు కేంద్రాల్లో కొనుగోళ్లకు వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయటంలేదు. గుంటూరుజిల్లా దాచేపల్లి, కర్నూలు, కృష్ణాజిల్లా నందిగామ తదితర ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటైన కేంద్రాల్లో తూతూ మంత్రంగా కొనుగోలుచేసి వ్యాపారులు చేతులు దులుపుకుంటున్నారు. వ్యాపారులు ఆయా కేంద్రాలకు వెళ్లి కొనుగోలు చేయాలంటే స్థానికంగా రైతుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. యార్డులో అయితే ఇష్టారాజ్యంగా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చనే భావన వ్యాపారులలో వ్యక్తమవుతోంది. దీంతో కేంద్రాలు ఏర్పాటైనా రైతులకు ప్రయోజనం కలగటంలేదు. గుంటూరు యార్డులో ఇప్పటి వరకు వ్యాపారులు కొనుగోలు చేసిన రెండులక్షల క్వింటాళ్లతో పాటు మరో లక్ష క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి. వేసవి గాడ్పులు వీయటంతో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యార్డులో సరకును కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా మిర్చి ధర యథాప్రకారం క్వింటాల్‌కు రెండు నుంచి మూడువేలకు అంటే గణనీయమైన స్థాయిలో పడిపోయింది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 15 వందల రాయితీ ఇప్పటి వరకు 15 వేల మంది రైతుల ఖాతాలో జమ అయినట్టు అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి అందులో ఒక వంతు మందికి కూడా అందలేదని సమాచారం. గత నెల 20 నుంచి చంద్రన్న రాయితీ పథకం ప్రారంభించారు. యార్డులో నిల్వలు పేరుకుపోవటంతో వరుసగా సెలవులు ప్రకటించారు. దీనికితోడు రైతులు సాగు ధ్రువీకరణ పత్రాల మంజూరు విషయంలో మితిమీరిన జాప్యం జరిగింది. ఈ లోగా వేసవి సెలవులు ప్రకటించారు. ఇక ఏ రకంగా ఒడ్డెక్కుతామో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయితీకి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు విధిస్తే కేంద్రం ప్రకటించిన మద్దతుధర కేవలం నాణ్యతా ప్రమాణాలు కలిగిన మోడల్ మిర్చికే పరిమితమవుతోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్ట పోయిన రైతులకు ఈ పథకం ఏ మాత్రం వర్తించదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేంద్ర మద్దతుధర, రవాణా ఖర్చులు ఏ ఒక్క రైతుకు అందలేదు. మోడల్ మిర్చికి మార్కెట్‌లో 8 వేల పైచిలుకు ధర పలుకుతోంది. దీంతో నాణ్యతా ప్రమాణాలు కలిగిన మిర్చి విషయంలో మద్దతుధర కోసం రైతులు ఎదురు చూడటంలేదు. అకాల వర్షాల కారణంగా నాణ్యత, దిగుబడి తగ్గిన రైతులకు అటు కేంద్ర పథకం వర్తించక, ఇటు రాయితీలో జాప్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్నారు. అసలు కేంద్ర మద్దతుధరకు సంబంధించి కచ్చితమైన విధివిధానాలే ఇప్పటి వరకు అందలేదని అధికారులు చెప్తున్నారు. గత ఏడాది క్వింటాల్ 13 వేల వరకు కొనుగోళ్లు జరిగితే ఈ ఏడాది కనీసం 3 వేలకు కూడా కొనే పరిస్థితులు లేవని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కంటికి రెప్పలా పంటను కాపాడుకుని యార్డుకు తీసుకొస్తే కన్నీరే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న రాయితీతో పాటు కేంద్ర మద్దతుధర జూన్ నెలాఖరు వరకే వర్తిస్తుందని ప్రభుత్వాలు ప్రకటించాయి. సెలవుల కారణంగా మరో నెలరోజులు పొడిగించి నష్టపోయిన రైతులకు నాణ్యతతో నిమిత్తంలేకుండా పూర్తిస్థాయిలో మద్దతు, రాయితీతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.