ఆంధ్రప్రదేశ్‌

ఒకర్ని మంచి ఒకరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 15: సుమారు 1000 కోట్ల హవాలా కేసులో ప్రధాన నిందితుడు వడ్డి మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావు పోలీసులను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వడ్డి మహేష్‌ను విశాఖ నగర పోలీసులు శనివారమే నగరానికి తీసుకువచ్చి, ఆదివారం అరెస్ట్ చూపించారు. అతనిని సోమవారం కోర్టులో హాజరు పరిచారు. పోలీసులు మహేష్‌ను ప్రశ్నిస్తున్నప్పుడు ఈ మనీ లాండరింగ్ వ్యవహారం అంతా తన తండ్రి నేర్పించిందేనని చెప్పుకొచ్చాడు. అయితే ఈ హవాలా కుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసుల అదుపులో ఉన్న వడ్డి శ్రీనివాసరావు చెప్పడం గమనార్హం. ఈ హవాలా వెనుక ఎవరు ఉన్నారన్న విషయం తనకు తెలియదని శ్రీనివాసరావు చెపుతున్నాడు. అయితే, వడ్డి శ్రీనివాసరావును రెండు రోజుల కిందటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రశ్నిస్తున్నా, వాస్తవాలు చెప్పకపోవడంతో పోలీసులు అతనిని విచారిస్తున్నారు. అయితే కాగా, శ్రీనివాసరావు గతంలో చీట్లు వేసి, పెద్ద మొత్తాన్ని ఆర్జించాడు. 1986-87 ప్రాంతంలోనే తండ్రి, కొడుకు కోల్‌కతాకు మకాం మార్చారని పోలీసు అధికారులు చెపుతున్నారు.
కాగా, మహేష్, అతని తండ్రి శ్రీనివాస్ ఈ హవాలా వ్యాపారాన్ని 2014 నుంచే ముమ్మరంగా చేస్తూ వచ్చారు. అయితే పెద్ద నోట్ల రద్దు సమయంలో వీరు ఈ వ్యాపారాన్ని తగ్గించారని, పరిస్థితులు కాస్త చక్కబడ్డాక, ఈ వ్యాపారాన్ని మళ్లీ కొనసాగించారని పోలీసు వర్గాలు చెపుతున్నాయి.
స్వచ్ఛందంగా లొంగిపోయిన మహేష్
ఇదిలా ఉండగా ఈ కేసు ఎప్పుడైతే విశాఖ ఎంవిపి పోలీస్ స్టేషన్‌లో నమోదైందో వెంటనే నగర పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు కోల్‌కత్తా వెళ్లారు. అయితే తానే స్వచ్ఛందంగా లొంగిపోతానని చెప్పి, మహేష్, అతని భార్యా, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు సొంత విమాన ఖర్చులతో విశాఖకు చేరుకున్నారని కమిషనర్ యోగానంద్ చెప్పారు.