ఆంధ్రప్రదేశ్‌

15నాటికి అన్ని కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ ద్వారానే ఫైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: మే 15 నాటి నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలోని ప్రధానమైన పలు శాఖల ద్వారా నిర్వహించే ఫైళ్ల నిర్వహణ ఇ-ఆఫీసు ద్వారానే నిర్వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కార్యదర్శి, ఎక్స్ అఫిషియో ఐటి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు.
స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం 11 జిల్లాల నుంచి వచ్చిన 114 మంది డిఎఓ లోక్ ఎడ్మిన్లకు చెందిన సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణను కలెక్టర్ బాబు ఎ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ ఇ-గవర్నెన్స్ విధానంలో సాంకేతిక పరిజ్ఞానం జోడించి ప్రజలకు ఉత్తమమైన ప్రభుత్వ సేవలు అందించాలనే ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. గతంలో హైదరాబాద్ జిహెచ్‌ఎంసి పరిధిలో తాను, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ ఆధ్వర్యంలో ఇ-ఆఫీస్ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టి అమలు చేయడం జరిగిందన్నారు. ఫైల్స్ పరిష్కారంలో జాప్యం ఉంటుందనే ప్రజల అపోహను తొలగించే దిశగా ఇ-ఆఫీస్ విధానంలో సాంకేతిక పరిజ్ఞానం పారదర్శకతతో కూడిన పరిపాలనను అందించడం సాధ్యమవుతుందన్నారు. జిహెచ్‌ఎంసిలో చేపట్టిన చర్యల నేపథ్యంలో ఈ విధానంపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. తొలిదశలో ఇ-ఆఫీస్ నిర్వహణలో భాగంగా గత దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న ఫైళ్లను కొనసాగించడం కష్టమని కొందరు ఉన్నతాధికారులు భావించడం జరిగిందన్నారు. గతంలో నిర్వహించిన ఫైల్స్, రికార్డులను స్కానింగ్ ద్వారా భద్రపరిచి తదుపరి వినియోగించుకునే సౌలభ్యంపై పథక రచన చేయడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే ఈ విధానంలో ఉత్తమ ప్రతిభ కలిగిన వారిలో కృష్ణా కలెక్టర్ బాబు ఎనితీరు మార్గదర్శకంగా నిలుస్తుందని, శిక్షణకు ఉత్తమమైన ప్రాంతం ఇదేనని తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో రాష్టస్థ్రాయి ఇ-ఆఫీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఒక దశ దిశ నిర్దేశం అందిస్తామని ప్రద్యుమ్న తెలియజేశారు. ఫైళ్ల పరిష్కారంలో ఇ-ఆఫీస్ ఒక తేలికమైన మార్గంగాను కాలయాపనకు ఎటువంటి అవకాశం ఉండదన్నారు. ఇప్పటికే పలువురు జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది ఇ-ఆఫీసు సమర్థతను గుర్తిచి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో పరిపాలన అటు హైదరాబాదులోను, ఇటు విజయవాడలోను నిర్వహిస్తున్న ఫైళ్లను మోసుకువెళ్లే భారం లేకుండా ఇ-ఆఫీసు ద్వారా ప్రజలకు ప్రభుత్వం సమర్థవంతమైన పాలనను అందించడం సాధ్యమవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్నా ప్రయాణాలలో ఉన్నా, అత్యవసర సమావేశాలలో ఉన్నా, ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉండడం ద్వారా ల్యాప్‌ట్యాప్ దారా ఫైళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతోందని, ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణం అధికారులు స్పందించి పరిపాలన చేపట్టడమే తార్కాణం అన్నారు. గత కాలపు టైపుమిషన్‌లకు స్వస్తి పలికారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోను కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయని ప్రద్యుమ్న తెలిపారు. ఐటి శాఖ ద్వారా కావల్సిన ఆర్థికపరమైన, సాంకేతిక పరమైన సూచనలను సహాయ సహకారాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇ-ఆఫీస్ నిర్వహణపై కలెక్టర్ బాబు ఎ శిక్షణ
ప్రాథమిక దశలో ఇ-ఆఫీస్ నిర్వహణ కష్టంతో కూడుకున్న పని అని కష్టపడితేనే ఫలితం ఉంటుందని, ఇందులో మరో ఆలోచనకు తావులేదని కలెక్టర్ బాబు ఎ స్పష్టం చేశారు. ఇ-ఆఫీస్ నిర్వహణపై రెండు దఫాలుగా జిల్లా కలెక్టర్లకు, వివిధ శాఖల అధిపతులకు, సాంకేతిక సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చామని తెలిపారు. కృష్ణా జిల్లాలో అమలుపరుస్తున్న ఇ-ఆఫీస్ ప్రణాళికలను వివిధ శాఖలతో రూపొందించి అమలుపరుస్తున్న కార్యాచరణ ప్రణాళికల సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని జిల్లాలకు అందించామని కలెక్టర్ బాబు ఎ తెలిపారు. ఇ-ఆఫీస్ నిర్వహణలో ప్రధాన భాగమైన 7 కాలముల నమూనాను అందించామన్నారు.