ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్‌కు గాదె గుడ్‌బై.. నేడు టిడిపిలో చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 28: కాంగ్రెస్ కురువృద్ధుడు, ఏఐసిసి సభ్యుడు గాదె వెంకటరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 1967లో ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యేగా క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన గాదె మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొలువులో పలు మంత్రి పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. పర్చూరు నియోజకవర్గం నుంచి మూడోవిడత 1991లో గెలుపొందిన ఆయన అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. బాపట్ల నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. వైఎస్ సర్కార్‌లో దేవాదాయశాఖ బాధ్యతలను నిర్వర్తించారు. అప్పట్లోనే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితిపై శాసనసభ సమావేశాల్లో గాదె వెంకటరెడ్డి గళమెత్తారు. వైఎస్ హయాంలో ప్రత్యేక ఆర్థిక మండలి చైర్మన్ పదవిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసేందుకు నిరాకరించారు. రాష్ట్ర విభజనతో మనస్తాపం చెందిన ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు సుముఖత చూపలేదు. గత రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న గాదె తన సన్నిహితులు, అనుచరులతో సమావేశమై తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందనే ఆవేదనతోనే తాను పార్టీని వీడుతున్నట్లు గాదె మీడియాకు స్పష్టంచేశారు. గురువారం గుంటూరు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులుతో మంతనాలు జరిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో అనేక కార్యక్రమాలకు హాజరుకానున్నారు. సీఎం సమక్షంలో గాదె సైకిలెక్కాలని నిర్ణయించారు. రాష్ట్రం విడిపోయి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ విభజన వల్ల జరిగిన నష్టం నుంచి కోలుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నందున నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునేందుకే పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.