ఆంధ్రప్రదేశ్‌

1 నుంచి మున్సిపాలిటీల్లో నిరంతరం నీటి సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మే 1వతేదీ నుంచి నిత్యం నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర మున్సిపల్‌శాఖమంత్రి నారాయణ అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ సమావేశం హాల్‌లో అధికారులు, కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 60రోజులపాటు రాష్టవ్య్రాప్తంగా నీటి ఎద్దడి ఉంటుందని, ఈ సమయంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఎంత నిధులైనా వెచ్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టిసీమప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణానదికి ఈఏడాది 4.5టిఎంసిల నీటిని తరలించడం వలననే కొన్నిప్రాంతాల్లో నీటి సమస్య తీరిందన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చిత్తూరుజిల్లాకు 4కోట్ల రూపాయలు కేటాయిస్తే నిధులు ఖర్చు లెక్కలు చూపారు తప్పితే నీళ్ళుమాత్రం ప్రజలకు అందలేదని, ఇలాంటి పరిస్థితి కల్పించకుండా సక్రమంగా నీటి సరఫరా చేయాలని అధికారులను కోరారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిఅవుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గుంటూరు, ప్రకాశం, కృష్ణాజిల్లాల్లో తాగునీటి ఎద్దడి ఉందని, దీనిని అధిగమించేందుకు అన్నిచర్యలు చేపట్టినట్లు తెలిపారు.