ఆంధ్రప్రదేశ్‌

బయోమ్యాక్స్‌లో ఉత్పత్తి నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 28: విశాఖ జిల్లా దువ్వాడ సెజ్‌లోని బయోమ్యాక్స్ ఫ్యూయల్ కంపెనీలో సంభవించిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఉత్పత్తిని నిలిపివేస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి గురువారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ బి.మధుసూదనరావు తెలిపారు. కంపెనీ నిబంధనలు ఉల్లంఘించినందున అనుమతి కొనసాగింపును నిరాకరించామన్నారు.
2009లో కంపెనీ ప్రారంభించారని, కర్మాగారం నుంచి వెలువడే వ్యవర్థాలను శుద్ధిచేసి వదలాలన్నారు. అలా చేయకపోవడంతో నోటీసులు జారీ చేశామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లైసైన్సు రెన్యూవల్ చేయాలని కోరగా నిరాకరిస్తూ మూడుసార్లు నోటీసులు ఇచ్చామని వివరించారు. తాజాగా ప్రమాదం జరగడానికి రెండురోజుల ముందు నోటీసు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందన్నారు.
వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించకపోవడంతో పాటు అగ్నిప్రమాదం తరువాత కంపెనీ అంతా ధ్వంసం అయిన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వుల వరకూ ఉత్పత్తి నిలివేయాలని ఆదేశించామన్నారు. పరిస్థితి చక్కబడ్డాక మరోసారి పరిశీలించాకే అనుమతి మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బయోమ్యాక్స్‌లో మంటల ఉద్ధృతి తగ్గింది. మంటలు అదుపు చేసేందుకు గురువారం నేవీ ఫైర్ విభాగం అధికారులు డ్రై కెమికల్ పౌడర్ ఫైర్‌బాల్స్ వాడారు. మధ్యాహ్నానికి మంటలు కాస్త అదుపులోకి వచ్చాయి. ట్యాంకుల లోపలి భాగంగా మంటలు కొనసాగుతున్నాయి.

చిత్రం మంటలు అదుపుచేసేందుకు ఫోమ్ చల్లుతున్న అగ్నిమాపక సిబ్బంది