ఆంధ్రప్రదేశ్‌

వీరా ‘హోదా’ గురించి మాట్లాడేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 4: ఆయా రాష్ట్రాల్లో ప్రజలచే తిరస్కరణకు గురైన నేతలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వాగ్దానాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెనూ) కెఇ కృష్ణమూర్తి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే విభజన బిల్లులోనే ప్రత్యేక హోదాకి చట్టబద్ధత కల్పించేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. అధికారం కోసం కుట్ర రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేసి చూపిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పరాకాష్ఠ అని, తెలుగుదేశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటయ్యేందుకు, వౌలిక వసతుల కల్పనకే భూ సేకరణ చట్టంలో మార్పులు తెచ్చామని, దీని వల్ల ఏ ఒక్క రైతుకు కూడా నష్టం జరగదని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని, కాంగ్రెస్ చేసిన గాయాలను మాన్పగల సమర్ధత చంద్రబాబకు ఉందని ప్రజలు భావించి సిఎం పదవిని కట్టబెట్టారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని సిఎం నిలబెడతారని, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతారని స్పష్టం చేశారు.