ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి వేతనదారులకు ‘బయో’ హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 8: ఉపాధి వేతనదారులకు బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా కుప్పంలో దీన్ని చేపట్టాలన్నారు. ఉపాధి హామీ వేతనదారుల సమస్యలపై నరేగా అధికారులతో మంత్రి నారా లోకేష్ గురువారం సమీక్షించారు. ఉపాధి హామీ వేతనదారుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి.. ఇలాంటి సమస్యలు ఇక మీదట ఉండకూడదని మంత్రి లోకేష్ అన్నారు. వేతనదారులకు అడిగినప్పుడు పని ఇవ్వాలి, పని చేసిన 7 రోజుల్లో వేతనాలు చెల్లించాలని లోకేష్ దిశా నిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని రియల్ టైం గవర్నెన్స్‌కు అనుసంధానం చెయ్యడంతోపాటు, ఉపాధి హామీ వేతనదారుల సమస్యలన్నింటినీ ‘1100 ప్రజలే ముందు’ కాల్ సెంటర్‌కు అనుసంధానం చేసి పరిష్కరించాలన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పెండింగ్ నిధులు, వేతనాల చెల్లింపు ప్రక్రియలో జరుగుతున్న జాప్యం గురించి త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని లోకేష్ అన్నారు. వచ్చే రెండేళ్లలో వేతన చెల్లింపులు అన్నీ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా జరిగేలా కార్యాచరణ సిద్ధం చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. ఈ నెలాఖరులోగా నూరు శాతం వేతనదారుల ఆధార్, ఫోన్ నెంబర్ల అనుసంధానం పూర్తిచెయ్యాలని మార్గనిర్దేశం చేశారు. వేతనాల జాబితాను కేంద్ర ప్రభుత్వ సర్వర్‌కు అప్‌లోడ్ చేసిన తరువాత కొంతమంది వేతనాలు ఆధార్ సమస్యలతో తిరస్కారానికి గురవుతున్నాయి.. ఈ సమస్యపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఆధార్ అనుసంధానంలో ఉన్న లోపాలను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో నరేగా జాయింట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఏపి ఆన్‌లైన్ ప్రతినిధులు, టిసిఎస్ ప్రతినిధులు, బ్లూ ఫ్రాగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం.. అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి లోకేష్