ఆంధ్రప్రదేశ్‌

ప్రజా రాజధానికి రూ.కోటి విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: అమరావతి రాజధాని నగర అభివృద్ధికి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, ముళ్లపూడి చంద్రమతీదేవి స్మారకార్థం కోటి రూపాయల విరాళాన్ని వారి తనయుడు ముళ్లపూడి తిమ్మరాజా ప్రకటించారు. ఈ మేరకు ఏపి సిఆర్‌డిఏ కమిషనర్ పేరిట కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి కార్యాలయంలో శనివారం అందజేశారు. సంబంధిత చెక్కును ఏపి సిఆర్‌డిఎ ఓఎస్‌డి ఎం.రామకృష్ణ ద్వారా కమిషనర్‌కు పంపించారు. అమరావతి నిర్మాణానికి కోటి రూపాయలు ఇచ్చిన ముళ్లపూడి తిమ్మరాజాను కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ అభినందించారు.