ఆంధ్రప్రదేశ్‌

అతీ గతీ లేని ఏలేరు ఆధునీకరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 10: ఇటు గోదావరి బేసిన్‌లో డెల్టాల ఆధునీకరణతోపాటు ఏలేరు ఆధునికీకరణ పనులకు కూడా అతీగతీ లేకుండా పోయింది. సాగు జలాలు విడుదలతో డెల్టాలో ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయి. ఏలేరు పనులు నత్తనడక సాగడంతో అతీగతీ లేకుండా ఉంది. నిధులు మంజూరైన మూడేళ్లకు గానీ ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టలేదు. తీరా మొదలైన తర్వాత వర్షం సీజన్ ముంచుకురావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గోదావరి బేసిన్ ఉభయ గోదావరి డెల్టాల్లో కూడా అదే పరిస్థితి.
ఈ నేపధ్యంలో ఆధునీకరణ పనులు జరగకపోవడం వల్ల డెల్టాలో శివారు ప్రాంతాలకు నీరు అందని స్థితి షరా మామూలుగానే వుంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి ఏలేరు ఆయకట్టును స్థిరీకరించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈ స్థిరీకరణ సాధ్యపడాలంటే ఏలేరు ఆధునికీకరణ పూర్తి కావాల్సి వుంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపధ్యంలో ఆ సమయానికి ఏలేరు ఆధునికీకరణ అనుమానంగానే ఉంది.
ఇదిలా వుండగా దాదాపు పదేళ్ల క్రితం గోదావరి బేసిన్ ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.3361 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పెద్ద పెద్ద ప్యాకేజీలు రూపొందించి టెండర్లు పిలిచారు. రెండు మూడు సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. దీంతో చిన్న చిన్న ప్యాకేజీలుగా రూపొందించి టెండర్లు పిలిచారు. అయినప్పటికీ పంట విరామం ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితి లేదని తేలడంతో పనులు నత్తనడకన సాగాయి. దీంతో నిపుణుల కమిటీ పర్యటించి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని సూచించడంతో ఆ మేరకు ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. రెండు మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఒక అడుగు ముందుకేస్తే..రెండడుగులు వెనక్కి అన్నట్టుగా డెల్టాల ఆధునీకరణ జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 599 కోట్ల విలువైన పనుల వరకు జరిగాయి.
అదే విధంగా ఏలేరు ఆధునీకరణకు జిఒఎంఎస్ నెంబర్ 258 ప్రకారం 2007లో రూ.176 కోట్లు కేటాయించారు. తొమ్మిదేళ్లుగా ఆధునికీకరణ పనులు జరుగుతూనే వున్నాయి. రెండవ దశ టెండర్లతో కలిపి ఏలేరు ఆధునీకరణ పనులు రూ.236 కోట్లతో జరుగుతున్నాయి. మొదటి దశ ఆధునీకరణలో రూ. 108 కోట్లతో టెండర్లు పిలవగా అందులో రూ.98 కోట్ల విలువైన పనులు చేపట్టారు. ఇందులో దాదాపు రూ. 54 కోట్ల విలువైన హెడ్‌వర్క్సు వున్నాయి. రెండో దశలో రూ. 130 కోట్లతో పనులు చేపట్టారు. గత రబీ సమయంలో ఏలేరు కింద స్టాండింగ్ క్రాప్‌లకు నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జల వనరుల శాఖ అధికారులు కిర్లంపూడి మండలం సోమవరం, కృష్ణవరం వద్ద పుష్కర కాలువ నుంచి గోదావరి జలాలను ఏలేరు నదిలోకి కలిపారు. ఇపుడు పురుషోత్తపట్నం ద్వారా శాశ్వత ప్రాతిపాదికన ఏలేరు ఆయకట్టును స్థిరీకరించేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా కృషి చేస్తున్నారు. ఈ ఏడాది కూడా గత ఏడాది మాదిరిగానే ఏలేరు ఆయకట్టుకు డోకా లేకుండా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖరీఫ్ సీజన్ మొదలవుతోంది..డెల్టాలకు గోదావరి నది కాటన్ బ్యారేజి నుంచి ముందస్తుగానే సాగునీటిని విడుదల చేశారు. అఖండ గోదావరి నది కాటన్ బ్యారేజి ఎగువన వున్న ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కుడి, ఎడమ గట్ల పరీవాహంలో వున్న అనేక ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ ఎత్తిపోతల పథకాల కాలువలు పూడిక పేరుకుపోవడంతో సాగునీరు సవ్యంగా అందే పరిస్థితి కనిపించడం లేదు. పుష్కర, చాగల్నాడు, తొర్రిగడ్డ, వెంకటనగరం 1, వెంకటనగరం 2, తాడిపూడి ఎత్తిపోతల పథకాల క్లోజర్ సమయం ఆధునికీకరణ తూతూ మంత్రంగా జరిగింది. వర్షాలు మొదలైన తరువాత కాలువల పూడిక అక్కడక్కడ చేపట్టారు. కాలువలు తూడు పెరిగిపోయి దుబ్బు గడ్డితో ఇసుక దిబ్బలు మారాయి. ఈ దుస్థితిలో ఉన్న కాలవల్లో నీరు పారడం దుర్లభంగా ఉంది. డెల్టాల్లో సుమారు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే, ఎత్తిపోతల పథకాలు, మద్దిగెడ్డ, సుబ్బారెడ్డి సాగర్, ఏలేరు, పంపా, సూరంపాలెం, భూపతిపాలెం, ముసురుమిల్లి, పుష్కర, తాడిపూడి, తొర్రిగెడ్డ, వెంకటనగరం 1, వెంకటనగరం 2, చాగల్నాడు తదితర పధకాల ద్వారా మరో 5 లక్షల ఎకరాల వరకు సాగులో వుంది. ఏదేమైనప్పటికీ నిర్ధేశిత ఆధునికీకరణ పనులు వేసవి కాలంలో పూర్తయి వుంటే ఖరీఫ్‌లో ఎటువంటి ముంపు బెడద లేకుండా ఉండేది. అదే విధంగా ఆగస్టు నుంచి పురుషోత్తపట్నం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏలేరు ఆధునికీకరణ పూర్తి కాకపోవడంతో స్థిరీకరణ నామమాత్రంగానే అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.