ఆంధ్రప్రదేశ్‌

దేశవ్యాప్తంగా 100 డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: వాణిజ్యపరంగా వినియోగించే మోటారు వాహనాలకు డ్రైవర్ల డిమాండ్ నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తొలిదశలో కనీసం వంద డ్రైవర్ శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇక్కడ శిక్షణ పొందిన డ్రైవర్లను కేంద్ర సర్టిఫైడ్ కమర్షియల్ డ్రైవర్లుగా గుర్తిస్తారు. ప్రధానంగా నిర్మాణాలకు సంబంధించి భారీ యంత్రసామగ్రి రవాణా రంగంలో ఈ తరహా డ్రైవర్ల కొరత బాగా ఉన్న నేపథ్యంలో ఈ దిశగా డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే అంశంపై కేంద్ర ఉపరితల రవాణా, నైపుణ్యాల అభివృద్ధి మంత్రిత్వశాఖల మధ్య ఇటీవల ఓ ఒప్పందం జరిగిందని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. ఈ మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఒక్కో శిక్షణా కేంద్రానికి కోటి రూపాయలు చొప్పున నిధులను మంజూరు చేస్తుంది. డ్రైవర్ల శిక్షణ బాధ్యతను నైపుణ్యాల అభివృద్ధి మంత్రిత్వశాఖ చూస్తుంది. ఈ సంస్థల్లో నిర్దేశిత డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకునే అభ్యర్థులకు శిక్షణ భృతిగా శిక్షణా కాలం మొత్తానికి కలిసి ఒక్కో డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని సదరు ట్రైనీ డ్రైవర్ల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు. ఆధార్ అనుసంధానిత ప్రత్యక్ష నగదు బదిలీ ప్రాతిపదికన ఈ శిక్షణ భృతిని బదిలీ చేస్తారు.