ఆంధ్రప్రదేశ్‌

విద్యుదాఘాత బాధితులకు ఇక భారీ పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: విద్యుదాఘాతానికి గురై మృతి చెందినవారి కుటుంబాలకు, అంగవైకల్యానికి గురైనవారికి విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ నష్టపరిహారం చెల్లించేలా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఈఆర్‌సి) కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధన కింద విద్యుదాఘాతానికి గురై మృతిచెందినా, అంగవైకల్యానికి గురైనా భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. 2017/2గా పేర్కొనే విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. 2014లో ఏపిఈఆర్‌సి ఏర్పడిన నాటి నుంచి సామాన్యుల సంక్షేమం పైనే దృష్టి సారిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఎక్కడా లేనివిధంగా విద్యుత్ ప్రమాదాలకు విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ పరిహారం చెల్లించేలా నిబంధనలు తీసుకొచ్చామని, భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని ఏపిఈఆర్‌సి చైర్మన్ జస్టిస్ జి భవానీప్రసాద్ స్పష్టం చేశారు. విద్యుత్ ప్రమాద బాధితుల నియంత్రణ 2017/2 గురించిన తెలుగు, ఆంగ్ల భాష సమాచార ప్రతులను సోమవారం విజయవాడలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ చేతులమీదుగా ఆవిష్కరింపజేయనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై ఆదివారం ఏపిఈఆర్‌సి సభ్యులు పి రఘు, పి రామ్మోహన్‌తో జస్టిస్ భవానీప్రసాద్ సమీక్షించారు.
విద్యుత్ ప్రమాదంలో నష్టపోయిన వారికి, పశు, ఆస్తి సంపద నష్టానికి సంబంధించి పరిహారం చెల్లింపులో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని జస్టిస్ భవానీప్రసాద్ ఈసందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో సరైన భద్రతా చర్యలు తీసుకోనందున ఏటా 500 మంది దాకా విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడడం లేదా అంగవైకల్యానికి గురికావడం, పశు సంపదను కోల్పోవడం, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయని సమీక్షలో జస్టిస్ భవానీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతం కారణంగా ఎందరో జీవితాంతం అంగవైకల్యంతోనే జీవించాల్సి వస్తోందన్నారు. ఎలక్ట్రికల్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగే అగ్నిప్రమాదాల్లో తీవ్ర ఆస్తి నష్టానికి గురికావాల్సి వస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు లేకుండా, అభద్రతతో కూడిన నిర్వహణతో బోర్‌వెల్స్‌ను ఉపయోగించడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
ఫలితంగా రైతులు ప్రాణాలు కోల్పోవడం, అంగవైకల్యానికి గురికావడమో జరుగుతోందని జస్టిస్ భవానీప్రసాద్ వివరించారు. ఒక్కోసారి పశుసంపద, ఆస్తి నష్టమూ జరుగుతోందని తెలిపారు. సామాన్య వినియోగదారుల్లో విద్యుత్ భద్రత, టారిఫ్ ప్రతిపాదనలు, కేంద్ర రాష్ట్ర విద్యుత్ చట్టాలపై ఏపీఈఆర్సీ అవగాహన కల్పిస్తోందన్నారు. విద్యుత్ చట్టాలు, వినియోగదారుల హక్కులపై చైతన్యం కలిగించేలా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వినియోగదారులపై టారిఫ్ భారం పడకుండా చూస్తూనే విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలు అందిస్తున్నాయని చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థికంగా సుస్థిరతను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూనే ప్రసార, పంపిణీ నష్టాలను తగ్గించుకున్నప్పుడే విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థికంగా సుస్థిరత సాధిస్తాయని స్పష్టం చేశారు. భారత న్యాయ వ్యవస్థలో కీలకమైన న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఎన్‌వి రమణ ఈ కార్యక్రమంలో పాల్గొననుండటం ఈఆర్‌సికే గౌరవమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల్లో చైతన్యం వస్తే చాలావరకూ విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు వీలు కలుగుతుందని జస్టిస్ భవానీప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.